మహిళల్లో ప్రధానంగా కనిపించే రక్తహీనత సమస్యను ఎదుర్కోవాలంటే… ఈ సూప్ తాగాల్సిందే?

అన్ని సీజన్లలో అందుబాటులో ఉండే ఆకుకూరల్లో ఒకటైన బచ్చలి కూర మన ఆరోగ్యాన్ని రక్షించడంలో దివ్య ఔషధంలా పనిచేస్తుందని చెప్పొచ్చు. బచ్చలి ఆకు రసంలో అత్యధికంగా కాల్షియం, ఐరన్, జింకు, సోడియం,ఫోలెట్, మెగ్నీషియం వంటి మినరల్స్ తో పాటు విటమిన్ సి ,విటమిన్ ఏ, విటమిన్ కె, విటమిన్ బి12, కెరోటిన్, లుటిన్, జియాక్సంతిన్ వంటి సూక్ష్మ పోషకాలు సమృద్ధిగా ఉండి మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. బచ్చలి కూరతో పప్పు, ఫ్రై , బజ్జీలు వంటి రుచికరమైన వంటకాలు తయారు చేసుకుని తినొచ్చు.

 

వ్యాధి నిరోధక శక్తి పై తీవ్ర ప్రభావం ఉండే శీతాకాలం వర్షాకాలం లాంటి సీజన్లలో తరచూ బచ్చలి కూర సూప్ తయారు చేసుకొని సేవిస్తూ అద్భుత ఫలితాలు ఉంటాయని వైద్యులు సూచిస్తున్నారు. బచ్చలకూరలో పుష్కలంగా విటమిన్ సి, విటమిన్ ఏ, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండడం వల్ల మనలో వ్యాధి నిరోధక శక్తి పెంపొందిస్తుంది.గర్భిణీ మహిళలు బచ్చలి ఆకులతో తయారు చేసిన సూప్ తాగడం వల్ల రక్తహీనత సమస్య తొలగిపోయి గర్భస్రావాన్ని కూడా నిరోధించవచ్చు. బచ్చలి ఆకులు సమృద్ధిగా ఉన్న ఫోలేట్ గర్భిణీ స్త్రీలకు ఎంతో మేలు చేస్తుంది. స్త్రీలలో తరచూ ఎదురయ్యే రుతు సంబంధిత సమస్యలు తొలగించుకోవచ్చు

 

బచ్చలి కూరను ఆహారంలో తీసుకోవడంతో పాటు తరచూ బచ్చలి కూర సూప్ సేవించడం ఇందులో పుష్కలంగా ఉన్న కాల్షియం, మెగ్నీషియం, జింకు వంటి మూలకాలు ఎముకల దృఢత్వానికి తోడ్పడి వృద్ధాప్యంలో వచ్చే ఆస్తియోఫోరాసిస్, ఆర్థరైటిస్ వంటి సమస్యల నుంచి బయటపడవచ్చు. అధిక రక్తపోటు సమస్యతో బాధపడేవారు బచ్చలి సూప్ సేవించడం వల్ల రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగుపడి హైబీపీ గుండె సంబంధిత సమస్యల నుంచి రక్షణ పొందవచ్చు. బచ్చలి కూరను ఎక్కువగా తినే వారిలో కంటి సమస్యలు, చర్మ సమస్యలు తలెత్తే అవకాశమే లేద. అలాగే మూత్రంలో మంట, ఇన్ఫెక్షన్, మలబద్ధకం, పైల్స్ వంటి అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తరచూ బచ్చలి కూర సూప్ ను నిక్షేపంగా తీసుకోవచ్చునని న్యూట్రిషన్ వైద్యులు తెలియజేస్తున్నారు.