చేపలను తినడం మానేస్తున్నారా ఈ విషయం తెలిస్తే ఆ తప్పు అస్సలు చేయరు!

best-fish-to-eat

మనలో చాలామంది మాంసాహార ప్రియులు చికెన్, మటన్ తినడానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. కానీ వీటి కంటే అధిక ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ కలిగిన చేపలను ఆహారంగా తినడానికి సంకోచిస్తుంటారు. చేపలంటే ఇష్టం ఉండకపోవడానికి చాలామంది చెప్పే కారణం ఏమిటంటే చేపలు అధికంగా ముళ్ళు ఉండి నీసు వాసన వస్తుంటాయి కాబట్టి వీటిని తినటానికి ఇష్టపడరు. అయితే చేపలను సరైన పద్ధతిలో శుభ్రం చేసుకుని వండుకొని తింటే ఈ కారణాలన్నీ పెద్ద సమస్య కావు ఇప్పుడు చెప్పబోయే చేపల్లో ఉన్న ఆరోగ్య రహస్యాలు తెలిస్తే మీరు కూడా చేపలను తినడానికి ప్రయత్నం చేస్తారు.

తరచూ చేపలను ఆహారంగా తీసుకుంటే మన శరీరానికి అవసరమైన విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ డి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభించి మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తాయి మరియు విటమిన్ ఏ కంటి సమస్యలను తొలగించి కంటి చూపులు మెరుగుపరుస్తుంది.చేపలో సమృద్ధిగా లభించే విటమిన్ డి, కాల్షియం ఫాస్పరస్ వంటి మూలకాలు ఎముకలు, కండరాల దృఢత్వానికి సహాయపడుతాయి.

చేపల్లో అయోడిన్, ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉండి పిల్లల మెదడు పెరుగుదలకు సహకరించి జ్ఞాపక శక్తిని పెంపొందించడంలో సహాయపడుతుంది.మరియు ప్రమాదకర థైరాయిడ్ సమస్యను నియంత్రిస్తుంది.శరీరంలో పొటాషియం పరిమాణం తగ్గితే రక్త ప్రసరణ వ్యవస్థలో లోపం ఏర్పడి హైబీపీ సమస్య వస్తుంది. ఇలాంటివారు వారంలో మూడుసార్లు చేపలను తింటే మన శరీరానికి అవసరమైన పొటాషియం, మెగ్నీషియం వంటి మినరల్స్ సమృద్ధిగా లభిస్తాయి తద్వారా హై బీపీ, గుండె జబ్బులు, డయాబెటిస్ వంటి వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. చేపలను ఆహారంగా తీసుకుంటే అన్ని రకాల క్యాన్సర్లకు చక్కటి పరిష్కారం లభిస్తుంది. శ్వాస సమస్యలైన ఉబ్బసం ఆయాసం వంటి లక్షణాలను తగ్గించడంలో చేపలు అద్భుతంగా పనిచేస్తాయి.