కాకరకాయతో వీటిని కలిపి తింటే మీ ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లే?

ఎన్నో ఔషధ గుణాలు మెండుగా ఉన్న కాకరకాయను మన రోజువారి ఆహారంలో తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యాన్ని పెంపొందించడంలో సహాయపడుతుందని మనందరికీ తెలిసిందే. అలాగే కాకరకాయను తరచూ తినేవారిలో డయాబెటిస్, ఉబకాయం గుండెపోటు హైబీపీ వంటి సమస్యలు నియంత్రణలో ఉంచడంలో సహాయపడుతుంది.ఆయితే కాకరకాయలు తినే విషయంలో కూడా కొన్ని నియమాలు పాటించాలని న్యూట్రిషన్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాకరకాయను తిన్న తర్వాత కొన్ని రకాల ఆహార పదార్థాలను అస్సలు తినకూడదు తింటే మన ఆరోగ్యం పై వ్యతిరేక ప్రభావం పడి అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు.

కాకరకాయతో చేసిన ఆహార పదార్థాలను తిన్న వెంటనే అధిక ప్రోటీన్స్ ఉన్న పాలను సేవిస్తే తీవ్రమైన జీర్ణ సమస్యలు తలెత్తి మలబద్ధకం అజీర్తి గ్యాస్టిక్ కడుపులో మంట వాంతులు విరేచనాలు వంటి సమస్యలు తలెత్తవచ్చు. అందుకే కాకరకాయను తిన్న తర్వాత అరగంటకు పాలు తాగవచ్చు. కాకరకాయను బెండకాయను కలిపి తింటే కాకరకాయలోని చేదు ప్రభావం బెండలోని జిగురు కలిసినప్పుడు జీర్ణ వ్యవస్థ పై వ్యతిరేక ప్రభావం పడి ఆహారం జీర్ణం అవడంలో సమస్యలు తలెత్తుతాయి. తద్వారా మలబద్ధక సమస్య తలెత్తవచ్చు.

కాకరకాయను తిన్నప్పుడు ముల్లంగి తో చేసిన వంటకాలను వెంటనే తింటే ముల్లంగిలోని ఘాటు స్వభావం స్వభావం కాకరలోని చేదు కలిసి జీర్ణమైనప్పుడు మనలో ఆమ్లత్వ స్వభావాన్ని పెంచి గొంతులో మంట, కడుపులో పుండ్లు వంటి సమస్యలు తలెత్తవచ్చు. మామిడికాయను లేదా మామిడి రసాన్ని తీసుకున్నప్పుడు వెంటనే కాకరకాయతో చేసిన ఆహార పదార్థాన్ని తింటే జీర్ణ వ్యవస్థ మందగించి కడుపులో వికారం, ఎసిడిటీ, కడుపులో మంట వంటి స్వల్ప అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కావున ఇప్పటినుంచి పైన సూచించిన ఆహార పదార్థాలతో కాకరకాయను తినాల్సి వచ్చినప్పుడు వాటిని పక్కన పెట్టేయడం లేదా కొంత సమయం ఆగి తినడం మంచిది.