తేనెను వీటితో కలిపి తింటే మీ ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది జాగ్రత్త..!

ప్రకృతి సిద్ధంగా లభించే తేనెలో ఎన్నో విశిష్ట ఔషధ గుణాలు ఉన్న కారణంగా ఆయుర్వేద వైద్యంలో ప్రముఖ స్థానం ఇవ్వబడింది. తేనె విశిష్ట గుణం వంద సంవత్సరాల పాటు నిల్వచేసిన వీటిలో ఉన్న ఔషధ గుణాలు చెక్కుచెదరవు. తేనెలో విటమిన్ సి, శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు , యాంటీ మైక్రోబియన్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి.తేనెను సరైన మోతాదులో, సరైన పద్ధతుల్లో ఉపయోగిస్తే మన ఆరోగ్యాన్ని రక్షిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే కొన్ని పదార్థాలతో కలిపి తేనెను తింటే శరీరం అస్వస్థతకు గురయ్యే ప్రమాదం ఉంది.

ఇప్పుడు చెప్పబోయే ఆహార పదార్థాలను తేనెతో కలిపి అస్సలు తినకూడదు అవేంటో ఇప్పుడు చూద్దాం.తేనె మన శరీరంలో వేడిని కలగజేసే గుణం ఉంది. కావున మన శరీరానికి చల్లదనాన్ని కల్పించే దోసకాయ, ముల్లంగి, శీతల పానీయాల్లో తేనెను కలిపి తీసుకోవడం మంచిది కాదు. దీనివల్ల జలుబు, గొంతు నొప్పి,కడుపుమంట, అజీర్తి, గ్యాస్టిక్ వంటి సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
మసాలా దినుసులు మరియు మసాలా ఆహారంతో కలిపి తేనెను తింటే ఆరోగ్యానికి మంచిది కాదు. అలాగే నెయ్యి,మిరియాలు, ఆవనూనె, ఆల్కహాల్ లో కలిపి తేనెను తింటే అజీర్తి విరోచనాల సమస్య తలెత్తవచ్చు.

ముఖ్యంగా ఒక సంవత్సరం లోపు పిల్లలకు తేనెను అస్సలు తినిపించకూడదు.డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తేనె తినే విషయంలో జాగ్రత్తలు వహించాలి.తేనెలో గ్లూకోస్ పరిమాణం ఎక్కువగా ఉంటుంది దీని తింటే రక్తంలో గ్లూకోజ్ మోతాదు పెరిగి డయాబెటిస్ నియంత్రణ కోల్పోతుంది.తేనెను వేడి చేయడం,వేడి పదార్థాలతో కలిపి తినడం, మరిగించడం, ఫ్రిజ్లో పెట్టడం వంటివి చేస్తే తేనే సహజ ఔషధ గుణాలను కోల్పోయి.తేనెను శుద్ధి చేయకుండా వినియోగిస్తే తేనెలో బొటులినియం ఎన్దోసపొర్స్ అనే సూక్ష్మజీవులు, తుతిన్ అనే విష పదార్థం మన ఆరోగ్యానికి కొంత హాని కలిగించవచ్చు.