రావి చెట్టు ఆకులు,బెరడుతో ఇలా చేస్తే….శ్వాస సంబంధిత అన్ని వ్యాధులకు చెక్ పెట్టవచ్చు!

మన భారతీయ సంప్రదాయంలో రావిచెట్టును దేవత వృక్షంగా భావించి నిత్య పూజలు చేయడం తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం. దేవతా వృక్షంగా భావించే రావి చెట్టులో మన సంపూర్ణ ఆరోగ్యాన్ని పరిరక్షించే అన్ని ఔషధ గుణాలు నిండుగా ఉన్నాయన్న విషయాన్ని మన పూర్వీకులు ఏనాడో గుర్తించి రావి చెట్టుకు ఆయుర్వేద వైద్యంలో ప్రముఖ స్థానాన్ని ఇవ్వడం జరిగింది. మన సైన్స్ భాషలో చెప్పుకోవాలంటే రావి చెట్టు ఆకులు బెరడు వేర్లలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, యాంటీ మైక్రోబియల్, యాంటీ సెప్టిక్ యాంటీ ఫంగల్ గుణాలు సమృద్ధిగా ఉన్నాయన్నమాట.

రావి చెట్టు ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చర్మంపై ముడతలు ఏర్పడి వృద్ధాప్య లక్షణాలతో బాధపడేవారు రావిచెట్టు వేర్ల చివర్లను కోసి నీళ్లలో నానబెట్టి మెత్తటి మిశ్రమంగా గ్రైండ్ చేసుకొని ముఖ చర్మం పై లేపనంగా రాసుకుంటే రావి చెట్టు వేర్లలో ఉండే యాంటీ ఏజింగ్ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ అలర్జిటిక్ లక్షణాలు చర్మ సమస్యలను తొలగించడమే కాకుండా
సహజ పద్ధతిలో చర్మంపై ఏర్పడిన ముడతలు, మచ్చలు తగ్గి వృద్ధాప్య లక్షణాలు తొలగిపోతాయి.

ఆస్తమా, ఉబ్బసం,బ్రాంకైటిస్, న్యుమోనియా వంటి శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడేవారు రావి చెట్టు బెరడు చక్కని పరిష్కారం చూపుతుంది. రావి చెట్టు బెరడు లోపలి భాగాన్ని సేకరించి నీడన ఆరబెట్టి పొడిగా గ్రైండ్ చేసుకొని తరచు కొన్ని రోజులపాటు ఈ పొడిని నీళ్లల్లో వేసుకొని లేదా పాలలో కలుపుకొని సేవిస్తే శ్వాస సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే రావి చెట్టు బెరడును నీళ్లలో వేసి బాగా మరగనిచ్చిన తర్వాత వచ్చిన కషాయాన్ని సేవిస్తే రింగ్‌వార్మ్, గజ్జి, దురద వంటి చర్మ వ్యాధుల నుండి చక్కటి పరిష్కారం లభిస్తుంది.

అరికాళ్ళు, మడమలు చిలి తీవ్రమైన నొప్పి , రక్తస్రావంతో బాధపడేవారు రావి ఆకులు తొలగించినప్పుడు వచ్చే పాలను పూయడం ద్వారా పగిలిన మడమలు సమస్యకు పరిష్కారం లభిస్తుంది
రావిచెట్టు బెరడు, కాచుతుమ్మ, ఎండుమిర్చి మెత్తగా నూరి ఈ మిశ్రమంతో తరచూ దంతాలను శుభ్రం చేసుకుంటే నోట్లో ప్రమాదకర బ్యాక్టీరియా నశించిపోయి దంత క్షయం,చిగుళ్ల సమస్య తొలగిపోవడమే కాకుండా దంతాలు పటిష్టంగా మారుతాయి.