గులాబీ పూల అందాన్ని గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది. రంగురంగుల గులాబీ పూలు మనస్సు కు ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలిగించడమే కాకుండా చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడంలో కూడా ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. గులాబీ పూల మిశ్రమాన్ని ప్రముఖ బ్యూటీ కాస్మోటిక్స్ లో కూడా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. గులాబీ పూలను ప్రత్యేక పద్ధతిలో ప్రాసెస్ చేసి రోజ్ వాటర్ తయారు చేస్తున్నారు.రోజ్ వాటర్ చర్మాన్ని హైడ్రేట్ చేయడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనిని టోనర్లోనో, మిస్టలోనూ, మరెన్నో కాస్మెటిక్స్ లో ఎన్నో ఏళ్లుగా ఉపయోగిస్తూ వస్తున్నారు.
చర్మ సంరక్షణలో గులాబీ నీళ్లను (రోజ్ వాటర్) ను ఉపయోగిస్తే ఇందులో ఉండే సహజ యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు చర్మంపై ఉండే మృత కణాలను తొలగించి చర్మంపై ఏర్పడే రంధ్రాలను, మచ్చలను, ముడతలను తగ్గించడంతో పాటు చర్మ ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో ఎంతగానో సహాయపడుతుంది. అలాగే రోజ్ వాటర్ లో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు
యాక్నె తొలగించి మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడుతుంది. – గులాబీ నీరు సంగ్రహాల కారణంగా మీ చర్మంపై ఉండే రెడ్ నెస్ ఇంకా ఇరిటేషన్ తగ్గు ముఖం పడతాయి.
జిడ్డు చర్మ సమస్యతో బాధపడేవారు ఒక టీస్పూన్ ముల్తానీ మట్టిలో రెండు లేదా మూడు టీస్పూన్ల రోజ్ వాటర్ వేసి మెత్తటి మిశ్రమంగా మార్చుకోవాలి.
ఈ మిశ్రమాన్ని ముఖంపై అప్లై చేసి, సున్నితంగా వృత్తాకార కదలికలతో మీ ముఖాన్ని మసాజ్ చేస్తూ సమానంగా విస్తరించండి.. ప్యాక్ ని రెండు నిమిషాల వరకు లేదా ముల్తానీ మట్టి ఎండిపోయినట్లు మీకు అనిపించే వరకు ఉంచి గోరువెచ్చని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే ముఖంపై జిడ్డు సమస్య తొలగిపోవడమే కాకుండా బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ మొటిమలు, మచ్చలు మరియు ముడతలు తొలగిపోయి చర్మం సహజ కాంతివంతంగా మెరుస్తుంది.రోజ్ వాటర్ బాటిల్ ని ముఖానికి 5 నుండి 6 అంగుళాల దూరంలో ఉంచి స్ప్రే చేసుకొని గాలికి ఆరిన తర్వాత మాయిశ్చరైజర్ రాసుకుంటే అన్ని రకాల చర్మ అలర్జీలు తొలగిపోతాయి.