పన్నీర్ లో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొన్ని రకాల వ్యాధులతో బాధపడేవారు పన్నీర్ ను రోజు వారి ఆహారంలో ఎక్కువగా తింటే తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడాల్సి వస్తుందని న్యూట్రిషన్ వైద్యులు హెచ్చరిస్తున్నారు.పనీర్ లో మాంసాహారంతో సమానంగా ప్రోటీన్లు, క్యాలరీలు, కొవ్వు పదార్థాలు పుష్కలంగా లభిస్తాయి. కావున శాఖాహారుల్లో ప్రోటీన్ లోపాన్ని సరి చేయడానికి పనీర్ అద్భుతమైన ఆహారంగా చెప్పవచ్చు. అయితే హై బీపీ, లో బీపీ, అతి బరువు, స్థూలకాయం, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవారు పన్నీర్ ఎక్కువగా తింటే మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ నిల్వలు అధికంగా పెరిగి చిన్న వయసులోనే గుండె సంబంధిత సమస్యలతో బాధపడాల్సి వస్తుంది.
పన్నీర్లో పుష్కలంగా ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది.అయితే జీర్ణశక్తి తక్కువగా ఉన్నవారు, గ్యాస్ట్రిక్ ,బలబద్ధకం వంటి జీర్ణ సంబంధిత వ్యాధులతో బాధపడేవారు పన్నీర్ ను తక్కువగా తినడమే మంచిది. ముఖ్యంగా రాత్రి భోజనంలో అత్యధిక కొవ్వు పదార్థాలు ఉన్న పన్నీర్ ను ఆహారంలో తీసుకుంటే ఇందులో ఉండే కొవ్వు పదార్థాలు జీర్ణం అవ్వడానికి అధిక సమయం తీసుకుని కడుపులో మంట, కడుపు ఉబ్బరం, తేపులు వంటి సమస్యలతో సరిగా నిద్ర పట్టక నిద్రలేమి సమస్యతో బాధపడాల్సి వస్తుంది.
పన్నీర్లో పుష్కలంగా ఉండే ప్రోటీన్స్,యాంటీ ఆక్సిడెంట్లు వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. విటమిన్ డి,కాల్షియం ఎముకల పెరుగుదలకు, దృఢత్వానికి తోడ్పడుతుంది. అలాగని మరీ ఎక్కువ పన్నీర్ ను ఆహారంగా తీసుకుంటే శరీరంలో ప్రోటీన్లు ఎక్కువైతే మన ఆరోగ్యం పై వ్యతిరేక ప్రభావాన్ని కలిగించి ముఖ్యంగా డయేరియా సమస్యకు దారి తీయవచ్చు. తరచూ వాంతులు,విరేచనాలలు, కొన్ని రకాల అలర్జీ సమస్యలతో బాధపడేవారు పన్నీరును ఆహారంగా తీసుకోవాలనుకుంటే వైద్యుని సలహాల మేరకు తీసుకోవడం మంచిది. ఎంత ఇష్టమైన ఆహారం అయినప్పటికీ మోతాదుకు మించి తింటే చెడు ఫలితాలనే ఇస్తుంది అన్నది ప్రతి ఒక్కరూ కచ్చితంగా గుర్తుంచుకోవాలి.