సమయానికి ఆకలి వేయట్లేదా.. ఆకలి వేయకపోతే ఇంత ప్రమాదం అంటూ?

ప్రస్తుత కాలంలో చాలామంది ఆకలి మందగించడం వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్య చిన్న సమస్యలా అనిపించినా ఈ సమస్య వల్ల ఎదురయ్యే ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. సమయానికి ఆహారం తీసుకోని వాళ్లను ఎక్కువగా ఈ సమస్య వేధించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. మన శరీరంలోని ముఖ్యమైన అవయవాలలో కాలేయం ఒకటి కాగా కాలేయం శరీరంలో 500 కంటే ఎక్కువ పనులను కాలేయం నిర్వహిస్తుంది.

శరీరం నుంచి విషాన్ని, హానికరమైన పదార్థాలను తొలగించడంలో కాలేయం ఎంతగానో ఉపయోగపడుతుంది. జీర్ణకోశ నాళం నుంచి వచ్చే రక్తాన్ని లివర్‌‌ ఫిల్టర్‌ చేయడంతో పాటు ఆహారం జీర్ణం కావడంలో లివర్ కీలక పాత్ర పోషిస్తుంది. ఫ్యాటీ యాసిడ్స్‌‌ జీర్ణం కావటానికి లివర్ సహాయపడుతుంది. ఆహారం జీర్ణం అయిన తర్వాత హార్మోన్‌, ఎంజైమ్‌, ప్రోటీన్‌, కొలస్ట్రాల్‌ను తిరిగి శరీరానికి అందించడంలో ఇది సహాయపడుతుంది.

లివర్‌ పనితీరు మందగిస్తే కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. ఆకలి మందగిస్తుంటే లివర్ కు సంబంధించిన సమస్యలు ఉన్నాయని గమనించాలి. సరైన ఆహారం తీసుకుంటే మాత్రమే మన శరీర అవయవాలు సక్రమంగా పని చేసే అవకాశం అయితే ఉంటుంది. మలబద్దకం, మైగ్రేన్, గుండె సమస్యలు, రుతుక్రమ సిండ్రోమ్ కు చెక్ పెట్టడంలో లివర్ ఎంతగానో సహాయపడుతుందని చెప్పవచ్చు.

వాము, ఉప్పు, కరక్కాయ పెచ్చులు, శొంఠి, పిప్పళ్ళు చూర్ణం చేసుకుని ప్రతిరోజూ ఉదయం తాగడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. టి స్పూన్ మిరియాల పొడి,అర టీ స్పూన్ బెల్లం పొడి, కొద్దిగా తేనె కలిపి తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ఆకలి మందగిస్తున్న వాళ్లు ఈ విషయాలను గుర్తుంచుకుంటే మంచిదని చెప్పవచ్చు.