సహజంగా దొరికే ఆకుకూరల్లో బచ్చలి ఆకు కూర ఒకటి. గ్రామీణ పల్లె ప్రజల ఇంటి ఆవరణలో బచ్చలి కూర చెట్టు కచ్చితంగా కనిపిస్తుంది. బచ్చలి కూరతో పప్పు, పచ్చడి, బచ్చలి కూర బజ్జీలు, జ్యూస్ వంటి రుచికరమైన వంటకాలను తయారు చేసుకొని తినవచ్చు. బచ్చలి ఆకుకూరలు సమృద్ధిగా విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ ఖనిజాల లవణాలు సమృద్ధిగా లభిస్తాయి. బచ్చలి ఆకు జ్యూస్ ను లేదా బచ్చలి కూరను ఆహారంగా తరచూ తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బచ్చలి కూరలో అత్యధికంగా 24.8 మిల్లీగ్రాముల కాల్షియం లభిస్తుంది. కావున తరచూ దీన్ని ఆహారంగా తీసుకుంటే మన శరీరానికి అవసరమైన కాల్షియం సమృద్ధిగా లభించి ఎముకలు, దంతాలు దృఢంగా ఉంచడంతోపాటు భవిష్యత్తులో వచ్చే దంత క్షయం, కీళ్ల నొప్పులు, రుమటాయిడ్ వంటి సమస్యలను తగ్గిస్తుంది.
అనీమియా సమస్యతో బాధపడేవారు బచ్చలి కూరను ఆహారంగా తీసుకున్న లేదా బచ్చలి కూర జ్యూస్ ను ప్రతిరోజు సేవిస్తే ఇందులో మిల్లి గ్రాములు పుష్కలంగా ఉన్న ఐరన్ రక్త కణాల వృద్ధికి తోడ్పడి మనలో ప్రమాదకర అనీమియా సమస్యను తొలగించడంతోపాటు నీరసం, ఒత్తిడి, చేతులు కాళ్ళ తిమ్మిర్లు వంటి సమస్యలను తగ్గిస్తుంది.
బచ్చలి కూరలో 140 మిల్లీగ్రాముల పొటాషియం లభిస్తుంది కావున దీన్ని ఆహారంగా తీసుకుంటే రక్తనాళాలను శుద్ధిచేసి రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది దాంతో హై బీపీ, హార్ట్ ఎటాక్ వంటి సమస్యలు తగ్గుతాయి.19.8 మిల్లీగ్రాములు సోడియం బచ్చలు కూరలో లభిస్తుంది మన శరీర సమతుల్యానికి సహాయపడుతుంది.
బచ్చలి కూరలు అత్యధికంగా విటమిన్ సి, సాఫోనిన్ అనే పదార్థం లభిస్తుంది ఇది మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడమే కాకుండా అనేక క్యాన్సర్ కారక వ్యర్ధాలను తొలగించడంలో సహాయపడుతుంది. బచ్చలి కూరలో ఉన్న ఔషధ గుణాలు యూరిన్ ఇన్ఫెక్షన్ తగ్గించడమే కాకుండా మూత్రపిండంలో రాళ్ల సమస్యలు కూడా అరికడుతుంది.