కాక్టస్ జాతి పండ్లల్లో ఒకటైన డ్రాగన్ ఫ్రూట్ ను ప్రతిరోజు మన ఆహారంలో తీసుకున్నట్లయితే అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చునని వైద్యనిపుణులు స్పష్టం చేస్తున్నారు. డ్రాగన్ ఫ్రూట్ రుచికి తీపి,పులుపు కాంబినేషన్లో అద్భుతంగా ఉంటూ మన శారీరక మానసిక ఎదుగుదలకు అవసరమైన ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, విటమిన్స్ , మినరల్స్ ను అందించడంలో సహాయపడుతుంది. అలాగే ఇందులో పుష్కలంగా ఉన్న ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు,కెరోటిన్,పాలీ అన్‌శాచురేటెడ్ ఫ్యాట్ వంటివి దీర్ఘకాలిక వ్యాధులను రాకుండా ఆపడంలో సహాయపడి సంపూర్ణ ఆరోగ్యాన్ని మనలో పెంపొందిస్తుంది.
డ్రాగన్ ఫ్రూట్ ను జ్యూస్ రూపంలో కంటే సహజంగా తింటేనే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు ఈ ఫ్రూట్లో పుష్కలంగా ఉన్న విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు మనలో ఇమ్యూనిటీ సిస్టమ్ అభివృద్ధి పరుస్తుంది. తరచూ నీరసం అలసట కళ్ళు తిరగడం వంటి సమస్యలతో బాధపడేవారు డ్రాగన్ ఫ్రూట్ ను ఆహారంగా తీసుకుంటే ఇందులో పుష్కలంగా ఉన్న ఐరన్ ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచి బ్లడ్ సర్కులేషన్ అభివృద్ధి పరచడం వల్ల మన శరీరానికి అవసరమైన రక్తం, ఆక్సిజన్ సరఫరా సమృద్ధిగా లభిస్తుంది. డ్రాగన్ ఫ్రూట్ లో సమృద్ధిగా ఉన్న కాల్షియం ఫాస్ఫరస్ ఎముకలను దంతాలను దృఢంగా ఉంచడంలో సహాయపడతాయి.
డ్రాగన్ ఫ్రూట్ లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ గుండె ఆరోగ్యాన్ని రక్షించడంలో ఉపయోగపడతాయి. రక్తనాళాల్లోని చెడు కొలెస్ట్రాలను తొలగించడంలో ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు సహాయపడి రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరచడమే కాకుండా మన శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయ పడతాయి. అందుకే ఉబకాయం రక్తపోటు వంటి సమస్యలతో బాధపడేవారు తరచు డ్రాగన్ ఫ్రూట్ ను ఆహారంగా తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మన శరీరంలో నీటి శాతాన్ని పెంచి డిహైడ్రేషన్ సమస్యను దూరం చేసే లవణాలు డ్రాగన్ ఫ్రూట్ లో పుష్కలంగా ఉన్నాయి.