నిద్రలేమి సమస్యతో బాధ పడుతున్నరా.. ఆ సమస్యకు సులువుగా చెక్ పెట్టే చిట్కాలివే!

ఈ మధ్య కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలామందిని వేధిస్తున్న ఆరోగ సమస్యలలో నిద్రలేమి సమస్య ఒకటి. ఈ సమస్య చిన్న సమస్య అని అనిపించినా ఈ సమస్య వల్ల పడే ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. నిద్రలేమి సమస్యకు థైరాయిడ్, ఇతర ఆరోగ్య సమస్యలు కారణమవుతాయి. నిద్రలేమి సమస్య వల్ల నిత్య జీవితంలో పనులు చేసే విషయంలో కూడా ఇబ్బందులు ఎదురవుతాయనే సంగతి తెలిసిందే.

అశ్వగంధ తీసుకోవడం ద్వారా నిద్రలేమి సమస్యకు చెక్ పెట్టవచ్చు. ట్రై ఎథిలిన్ గ్లైకాల్ ను కలిగి ఉన్న అశ్వగంధ నిద్ర నాణ్యతను మెరుగుపరచడంతో పాటు మంచి నిద్రను అందిస్తుంది. ప్రతిరోజూ రాత్రి సమయంలో అశ్వగంధను తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. మంచి కొవ్వులు, ఫైబర్ బాదాంలో పుష్కలంగా ఉంటాయనే సంగతి తెలిసిందే. బాదాం ఇమ్యూనిటీ పవర్ ను పెంచడంలో తోడ్పడుతుంది.

బాదాంలో ఉండే మెగ్నీషియం కండరాలను సడలించడంతో పాటు నిద్ర బాగా వచ్చేలా చేయడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఒక గ్లాస్ పాలలో చిటికెడు జాజికాయ తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. మెలటోనిన్, సెరటోనిన్ స్థాయిలను జాజికాయ పెంచుతుందనే సంగతి తెలిసిందే. పెపిటాస్ పేరుతో పిలవబడే గుమ్మడి గింజలు సైతం నిద్రలేమి సమస్యకు చెక్ పెట్టడంలో ఉపయోగపడతాయి.

ఈ చిట్కాలను పాటించడం ద్వారా నిద్రలేమి సమస్యను దూరం చేసుకోవచ్చు. చక్కని నిద్ర వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. మధ్యాహ్న సమయంలో నిద్రకు దూరంగా ఉండటం ద్వారా నిద్రలేమి సమస్యను అధిగమించవచ్చు. నిద్రలేమి సమస్య వల్ల నష్టాలు ఎక్కువని గుర్తుంచుకోవాలి.