ప్రస్తుత కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా ఎంతోమందిని అధిక కొవ్వు సమస్య ఇబ్బంది పెడుతోంది. అధిక కొవ్వు సమస్య వల్ల వేర్వేరు ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. కొర్రలు , ఓట్స్, జొన్నలు, రాగులు, కందులు, ఉలవలు ఆహారంలో భాగం చేయడం వల్ల సులభంగా బరువు తగ్గే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. నీరు ఎక్కువగా ఉండే కూరగాయలను తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.
నీటిశాతం ఎక్కువగా ఉండే కూరగాయలను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా అధిక కొవ్వు సమస్యకు చెక్ పెట్టవచ్చు. పగటిపూట నిద్రకు దూరంగా ఉండటం వల్ల అధిక కొవ్వు సమస్యను దూరం చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. కొవ్వు శాతం ఎక్కువగా ఉండే ఆహారాలకు వీలైనంత దూరంగా ఉంటే మంచిది. స్వీట్లు తినడానికి దూరంగా ఉంటే ఆరోగ్యానికి మంచిది.
ఎక్కువగా నీళ్లు తాగడం వల్ల సులువుగా బరువు తగ్గడంతో పాటు కొవ్వును సులభంగా కరిగించుకునే అవకాశాలు అయితే ఉంటాయి. రోజులో తక్కువ ప్రమాణంలో ఎక్కువసార్లు ఆహారం తీసుకోవడం వల్ల బరువు తగ్గే అవకాశం అయితే ఉంటుంది. ఉడకబెట్టిన కూరగాయలు, మొలకలు, వెజ్ సలాడ్, పండ్లు ఆహారంలో భాగం చేసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని చెప్పవచ్చు.
బార్లీ గింజలను గంజి చేసుకుని తాగడం ద్వారా బరువు తగ్గే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. తేనె వల్ల బరువును సులువుగా తగ్గించుకునే అవకాశం ఉంటుంది. గ్రీన్ టీ తాగడం వల్ల కూడా బరువు తగ్గే అవకాశం ఉంటుందనే సంగతి తెలిసిందే. సరైన జాగ్రత్తలు తీసుకుని బరువును అదుపులో ఉంచుకోవడం వల్ల కొవ్వు కరిగే అవకాశాలు అయితే ఉంటాయి.