Toothpaste: ఏ టూత్ పేస్ట్ మంచిది..? ఎవరెలాంటి పేస్ట్ వాడాలి..?

Toothpaste: పళ్లు తోముకునేందుకు గతంలో ఒకే రకంలో టూత్ పేస్టులు ఉండేవి. తర్వాత రోజుల్లో టూత్‌పేస్టుల్లో చాలా రకాలు వచ్చేశాయి. పదుల సంఖ్యలో బ్రాండ్లు.. ఆయుర్వేదం, ఉప్పు, జెల్.. అంటే అనేక రకాల ప్రత్యేకతలతో బిజినెస్ చేస్తున్నాయి కంపెనీలు. మరి.. వీటన్నింటిలో ఏది మంచి పేస్టో తెలుసుకోవడం కష్టమే అయినా తెలియాలి. దంతాల పటిష్టతకు, ఆరోగ్యానికి కనీసం రోజుకు 2సార్లైనా బ్రష్ చేస్తాం కాబట్టి సరైన టూత్‌పేస్ట్ తెలియాల్సిందే.

ఒక అంచనా ప్రకారం ‘టూత్ పేస్ట్ లన్నీ ఒకటే.. ఫ్లేవర్లలో మార్పులు అనేది బిజినెస్ స్ట్రాటజీ’ అంటారు. కొందరు టూత్‌పేస్ట్ కొనేటప్పుడు బ్రాండ్ చూసి కొంటారు. ఆ బ్రాండ్‌ టూత్‌పేస్టే మంచిది అనుకుంటారు. మరికొందరు.. ఉన్నవాటిలో ధర తక్కువ పేస్ట్ కొంటారు. ఇంకొందరు పేస్టుతోపాటు.. టూత్ బ్రష్, పేస్ట్ ఆఫర్లని చూసి కొంటారు. ఇలాంటి తాయిలాలే కానీ.. కంపెనీలకు లాభం కానీ.. మనకు కాదనేది నిపుణుల అభిప్రాయం. ఇంట్లో ఉండే అందరి దంతాలు ఒకేలా ఉండవు కాబట్టి.. ఒకే పేస్ట్ వాడకూడదు అంటారు.

కొందరికి సెన్సిటివ్ దంతాలు ఉంటాయి. వీరు డెంటిస్ట్ సలహా తీసుకోవడం ఉత్తమం. ఆరోగ్యం కోసం ఆమాత్రం జాగ్రత్త తప్పనిసరి. టూత్‌పేస్టులో ఫ్లోరైడ్ ఉంటుంది. అది చిగుళ్లు పాడవకుండా చేస్తుంది. కానీ.. ఆరేళ్లలోపు పిల్లలకు ఫ్లోరైడ్ టూత్‌పేస్ట్ అవసరం లేదు. పిల్లలకు తక్కువ ఫ్లోరైడ్ ఉన్న పేస్టు చాలు. అందుకే పేస్ట్ కొనేముందు అందులో ఎంత ఫ్లోరైడ్ ఉందో చూసుకోవడం ఉత్తమం. సెన్సిటివ్ దంతాలు ఉన్నవారు చల్లని పదార్ధాలు తినేటప్పుడు జివ్వుమంటాయి. మీరు వైటెనింగ్ టూత్‌పేస్ట్ వాడొద్దొంటున్నారు నిపుణులు. ఇందులో కెమికల్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఇర్రిటేషన్ తీసుకొస్తాయి.

పేస్టుల్లో ఎన్ని రకాలు వచ్చాయంటే.. వయసు తారతమ్యాన్ని బట్టి పిల్లలకు, పెద్దలకు పేస్టులు వచ్చేశాయి. పిల్లలకు పెద్దల పేస్టు వాడకూడదు. పేస్టులో వాడే పదార్థాలను కూడా లెక్కలోకి తీసుకోవాలి. పేస్టులు తియ్యగా ఉండాలని కొన్నింటిలో షుగర్ కలుపుతారు. వాటిని ఎక్కువగా వాడకూడదు. ఆ పేస్టులు పిల్లలకు వాడితే దంతాలు పాడవటం.. పుచ్చిపోయే అవకాశం కూడా ఉంది. తక్కువ షుగర్ ఉన్నవి.. లేదంటే అసలు షుగర్ లేని పేస్టులు కొనుక్కోవడం మరీ మంచిది.

 

గమనిక: ఈ వివరాలు మీ అవగాహన కోసం మాత్రమే. పలు సందర్భాల్లో ఆరోగ్య నిపుణులు, వైద్యులు అందించిన వివరాలనే ఇక్కడ ఇచ్చాం. మీ ఆరోగ్యం విషయంలో ఎటువంటి సమస్య ఉన్నా, సలహాలకైనా వైద్యులను, ఆరోగ్య నిపుణులను సంప్రదించడమే ఉత్తమం. మీ ఆరోగ్యానికి సంబంధించి ‘తెలుగు రాజ్యం’ ఎటువంటి బాధ్యత వహించదు. గమనించగలరు.