Bell Peppers: క్యాప్సికమ్ ను ఎలా తినాలి..? ఎక్కువగా తినొచ్చా..?

Bell Peppers: నేటి రోజుల్లో సలాడ్స్ ఎక్కువగానే తింటున్నాం. ఇందులో కూరగాయల ముక్కలు వేసుకుంటాం. వీటిలో మరింత ఫ్లేవర్ యాడ్ కోసం బెల్ పెప్పర్స్ (క్యాప్సికమ్)ని కలుపుతారు. భారత్ లో వీటిని క్యాప్సికమ్ అంటారు. లండన్, కెనడా వంటి దేశాల్లో బెల్ పెప్పర్స్ అంటారు. వీటిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. దీనిని ఆరోగ్యకరమైన డైట్ గా చెప్పాలి. ఇవి ఎరుపు, పసుపు, ఆరెంజ్.. వంటి రంగుల్లో వస్తూంటాయి.

బెల్ పెప్పర్స్ ని ఎక్కువగా తీసుకోవచ్చా? లేదా.. అనే సందేహం వస్తూంటుంది. బెల్ పెప్పర్ ఆరోగ్యానికి మంచిదే అయినా.. వీటి తొక్క జీర్ణం కావడానికి సమయం ఎక్కువ తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు, గ్యాస్, కడుపు నొప్పి సమస్యలు వస్తాయంటున్నారు డాక్టర్లు. దీనికి వారు చెప్పే చిట్కా.. బెల్ పెప్పర్స్ ను సలాడ్స్ ఉపయోగించేటప్పుడు.. పచ్చిగా కాకుండా ఉడికించి.. అదీ తక్కువ మోతాదులో అవసరమైతేనే వాడితే బెటర్ అంటున్నారు. బెల్ పెప్పర్ వాడటం వల్ల కొన్నిసార్లు ఇబ్బందులు ఎదురవుతాయని అంటున్నారు.

ఒక పదార్ధం తిన్న తర్వాత ఇబ్బంది పెడితే ఆపేయాలి. లేదంటే అనారోగ్య సమస్యలు వస్తాయి. ఆరోగ్యానికి మంచి చేస్తున్నవాటినే మనం తీసుకోవాలంటున్నారు డాక్టర్లు. బెల్ పెప్పర్స్ తొక్క జీర్ణం కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. సలాడ్స్ లో ఇవి మనకు పడవు అనుకుంటే తీసుకోవడం మానేయడం ఉత్తమం. ఇతర కూరగాయలు, పండ్లతో సలాడ్స్ చేసుకోవడం మంచిదని అంటున్నారు. బెల్ పెప్పర్స్ ను ఎలా తీసుకుంటే మంచిదో చూద్దాం.

ఒళ్లు నొప్పిని తగ్గించేందుకు ఇతర ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండేందుకు బెల్ పెప్పర్స్ ని తినొద్దు. బెల్ పెప్పర్స్ ను వేయించుకుని, బేకింగ్, స్టీమ్ (ఉడికించి) సలాడ్స్ లో కలిపి తీసుకోవచ్చు దీని వల్ల సమస్యలు రావు. బెల్ పెప్పర్స్ లో ఉండే గింజల్ని మొత్తం తీసేసి లోపల ఉండే తెల్లటి పొర తీసుకుని వాడినా ఫలితం ఉంటుంది. పైగా ఇలా చేయడం వల్ల జీర్ణ సమస్యలు రావు. బెల్ పెప్పర్ తో ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తే ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి.

 

గమనిక: ఈ వివరాలు మీ అవగాహన కోసం మాత్రమే. పలు సందర్భాల్లో ఆహార నిపుణులు, వైద్యులు అందించిన వివరాలనే ఇక్కడ ఇచ్చాం. మీ ఆరోగ్యం విషయంలో ఎటువంటి సమస్య ఉన్నా, సలహాలకైనా వైద్యులను, ఆహార నిపుణులను సంప్రదించడమే ఉత్తమం. మీ ఆరోగ్యానికి సంబంధించి ‘తెలుగు రాజ్యం’ ఎటువంటి బాధ్యత వహించదు. గమనించగలరు.