Almond: రోగనిరోధక శక్తిని పెంచే బాదంపప్పు..! ఇంకా..

Almond: రోజువారీ ఒత్తిడిలో భాగంగా మనం ఆరోగ్యాన్ని పక్కన పెడుతున్నాం. కానీ.. అన్ని పనులతోపాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అత్యంత అవసరం. విటమిన్లు, కాల్షియం, ప్రొటీన్లు, మెగ్నీషియం.. ఇలా అనేక పోషకాలున్న ఆహారం తీసుకోవడం చాలా ఉత్తమం. పప్పుల్లో ఎక్కువగా ఉండే ఈ పోషకాల్ని తీసుకోవడం ద్వారా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. వీటిలో ముఖ్యమైనది ‘బాదం’. వీటిలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఇవి మన ఆరోగ్యాన్ని కాపాడటమే కాదు.. రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి.

రెగ్యులర్ గా బాదం తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు దరి చేరవని ఎన్నో అధ్యయనాలు చెప్తున్నాయి. రోజుకు నాలుగు బాదంపప్పులు తినడం ద్వారా కూడా ఎన్నో ప్రయోజనాలు పొందొచ్చు. బాదంపప్పులో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇది ఎముకలను పటిష్టం చేయడంలో బాగా పని చేస్తుంది. ఎముకలకు సంబంధించిన సమస్యలను దూరం చేయగలదు. బాదంపప్పు చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా ఉండేలా చేస్తుంది. బాదంపప్పు కొలెస్ట్రాల్ నియంత్రణలో మంచి ఫలితాలను ఇస్తుంది.

ఎదిగే పిల్లలకు కాల్షియం ఎంతో అవసరం. పిల్లల్ ఎముకలను కూడా పటిష్టం చేస్తుంది. వారిలో జ్ఞపకశక్తి పెరిగేందుకు దోహదపడుతుంది. రోజుకు 8 నుంచి 10 బాదంపప్పులు వారితో తినిపించడం వల్ల వారిలో డిప్రషన్ తగ్గుతుంది. మెదడు చురుకుగా పని చేస్తుంది. వీటిలోని ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఎన్నో విధాల మేలు చేస్తాయి. జుట్టు రాలే సమస్యను బాదం తగ్గిస్తుంది. రోజూ ఉదయం రాత్రి నానబెట్టిన నాలుగు బాదం గింజలను తొక్కలు తీసి తింటే జుట్టు సమస్య తీరుతుంది. బాలింతలకు బాదంపప్పు బాగా పని చేస్తుంది. వారి ఆరోగ్యానికి ఎంతో మంచివి.

 

గమనిక: ఈ వివరాలు మీ అవగాహన కోసం మాత్రమే. పలు సందర్భాల్లో ఆహార నిపుణులు, వైద్యులు అందించిన వివరాలనే ఇక్కడ ఇచ్చాం. మీ ఆరోగ్యం విషయంలో ఎటువంటి సమస్య ఉన్నా, సలహాలకైనా వైద్యులను, ఆహార నిపుణులను సంప్రదించడమే ఉత్తమం. మీ ఆరోగ్యానికి సంబంధించి ‘తెలుగు రాజ్యం’ ఎటువంటి బాధ్యత వహించదు. గమనించగలరు.