రోగనిరోధక శక్తి పెరగాలంటే ఆహారంలో ఇవి కూడా ఉండాల్సిందే..!!

ప్రస్తుతం కరోనా అందరినీ కలవరపెడుతోంది. దీంతో యోగా, వ్యాయామం, నడక, సైక్లింగ్.. ఆరోగ్యంపై దృష్టి సారిస్తున్నారు. రోగనిరోధక వ్యవస్థను పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజా, పోషకాలు ఉన్న ఆహారం తీసుకుంటున్నారు. దీనివల్ల మన రోగ నిరోధక వ్యవస్థ బ్యాక్టీరియా, వైరస్ లతో పోరాడే శక్తిని కూడగట్టుకుంటుంది. వీటితోపాటు మరికొన్ని ఆహార నియమాలు పాటించాలి కూడా.


వెల్లుల్లి మనలో ఇమ్యూనిటీ పెంచుతుంది. రక్తపోటును తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ ని అదుపులో ఉంచుతుంది. వెల్లుల్లిలోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో బాక్టీరియాతో పోరాడే శక్తిని ఇస్తుంది. ఉసిరిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. ప్రతిరోజూ ఒక్క ఉసిరి కాయ తింటే విటమిన్ సి దక్కిన్నట్టే. కంటి చూపును మెరుగుపరుస్తుంది. జుట్టుకి రక్షణనిస్తుంది. చర్మం సంబంధ సమస్యలను తగ్గిస్తుంది. డయాబెటిస్ ని కూడా తగ్గిస్తుంది. జలుబు, తగ్గు, గొంతు నొప్పిని తగ్గిస్తుంది. ఇందులోని ఫైబర్ జీర్ణ సమస్యలను తొలగిస్తుంది. అధిక బరువును నియంత్రిస్తుంది.

అల్లం కూడా ఎన్నో ఆరోగ్య సమస్యలకు పరిష్కారం చూపుతుంది. దగ్గు, జలుబును తగ్గిస్తుంది. వాంతులు, వికారాన్ని తగ్గిస్తుంది. అల్లం తీసుకోవడం వల్ల గుండె జబ్బులు, క్యాన్సర్ ముప్పు కూడా తగ్గుతుందని నిపుణులు అంటున్నారు. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అల్లం టీ, సూప్ లలో అల్లం వేసుకుని తాగితే ఎంతో మంచిది. దాల్చిన చెక్క బరువు తగ్గిస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. శరీరంలోని బ్యాక్టీరియా పెరగకుండా కాపాడుతుంది. గొంతు నొప్పిని తగ్గిస్తుంది. ఇన్సులిన్ సామర్ధ్యాన్ని పెంచి డయాబెటిస్ ని తగ్గిస్తుంది. గుండె జబ్బులు, జీర్ణ సంబంధ సమస్యలను తగ్గిస్తుంది.

పసుపులో ఎన్నో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఆర్గానిక్ పసుపులో ఉండే కర్కుమిన్ కంటెంట్ క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. దెబ్బలను మందులా ఉపయోగపడుతుంది. బ్యాక్టీరియా, వైరస్ ను చంపుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. పసుపులోని కర్కుమిన్ ప్రయోజనాలు పూర్తిగా పొందేందుకు మిరియాల పొడిని కలిపితే పూర్తి ప్రయోజనాలు దక్కుతాయి. పసుపుని కూరల్లో వేయడం, పాలల్లో కలుపి రోజూ రాత్రి తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిది.

 

గమనిక: ఈ వివరాలను మీ అవగాహన కోసం మాత్రమే ఇచ్చాము. అర్హత కలిగిన నిపుణులు, వైద్యులకు ప్రత్యామ్నాయం కాదు. మీ ఆరోగ్యం కోసం ఆహార నిపుణులు, వైద్యలను సంప్రదించి తగిన సలహాలు తీసుకోవడమే ఉత్తమం.