పదేపదే మూత్రం వస్తుందా… ఈ వ్యాధుల బారిన పడినట్లే?

సాధారణంగా చాలామంది రోజుకు ఎక్కువసార్లు మూత్రం చేస్తూ ఉంటారు. ఇలా పదే పదే యూరిన్ వస్తున్నట్లయితే అలాంటి వారు కొన్ని రకాల సమస్యలతో బాధపడుతున్నారని అర్థం. సాధారణంగా ఒక మనిషి రోజుకు ఎనిమిది నుంచి పది సార్లు మూత్ర విసర్జన చేయడం సర్వసాధారణం అయితే అంతకన్నా ఎక్కువసార్లు మీరు మూత్ర విసర్జన చేస్తున్నారు అంటే తప్పనిసరిగా మీరు కొన్ని రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు అర్థం ఇలా తరచూ మూత్రం వెళ్లేవారు ఈ సమస్యలతో బాధపడుతున్నట్లు అర్థం.

తరచూ మూత్ర విసర్జనకు వెళ్తున్నారు అంటే అది షుగర్ వ్యాధికి సంకేతం.సాధారణంగా ఒక వ్యక్తి రోజుకు మూడు లీటర్ల మూత్ర విసర్జన చేస్తారు అయితే షుగర్ వ్యాధితో బాధపడేవారు రోజుకు మూడు నుంచి 20 లీటర్ల వరకు మూత్ర విసర్జన చేసే అవకాశాలు ఉన్నాయని నిపుణులు పలు పరిశోధనల ద్వారా వెల్లడించారు.ఇక యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కారణంగా కూడా తరచూ మూత్ర విసర్జన చేస్తుంటారు. అయితే ఈ సమస్య మహిళల్లో అధికంగా ఉంటుంది.

సూక్ష్మక్రిములు మూత్ర వ్యవస్థకు సోకినప్పుడు ఈ వ్యాధి వస్తుంది. ఇది మూత్రపిండాలు, మూత్రాశయంలను అనుసంధానించే గొట్టాలను కూడా ప్రభావితం చేస్తుంది. ఈ వ్యాధి సర్వసాధారణం అయినప్పటికీ ఏమాత్రం అలసత్వం చేసిన కిడ్నీకి కూడా ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉంటుంది.పురుషులలో అధిక మూత్రవిసర్జన చేయడం అనేక ప్రోస్టేట్ సమస్యలకు సంకేతం. మహిళల్లో తరచుగా మూత్రవిసర్జనకు కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి.. ఇందులో గర్భం, ఫైబ్రాయిడ్స్, మెనోపాజ్, అండాశయ క్యాన్సర్ ఉన్నాయి. అందుకే మూత్ర విసర్జన అధికంగా ఉండేవారు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం ఎంతో మంచిది.