కొబ్బరి నీళ్లు తాగేవాళ్లకు షాకింగ్ న్యూస్.. వాళ్లకు ఈ నీళ్లు ఎంత ప్రమాదమో తెలుసా?

మనలో చాలామంది కొబ్బరినీళ్లు తాగడానికి ఇష్టపడతారు. కొబ్బరినీళ్లు తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరికీ కొబ్బరి నీళ్లు ఎంతో మంచివనే సంగతి తెలిసిందే. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీరానికి అవరమైన పోషకాలు ఎక్కువగా లభిస్తాయి. నీరసంగా ఉన్నవాళ్లు కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు చేకూరే అవకాశాలు అయితే ఉంటాయి.

అయితే కొబ్బరి నీళ్లు తాగడం వల్ల లాభాలు ఎక్కువగానే ఉన్నా నష్టాలు సైతం అదే స్థాయిలో ఉన్నాయి. షుగర్ ఉన్నవాళ్లకు కొబ్బరి నీళ్లు ఆరోగ్యకరం కాదు. షుగర్ ఉన్నవాళ్లు కొబ్బరి నీళ్లను పరిమితంగా తీసుకుంటే మాత్రమే ఆరోగ్య ప్రయోజనాలు చేకూరే అవకాశాలు అయితే ఉంటాయి. కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధ పడేవాళ్లు కొబ్బరి నీళ్లకు దూరంగా ఉండాలి.

ఆ వ్యాధులతో బాధ పడేవాళ్లకు కొబ్బరి నీళ్లు మంచివి కావు. శరీరంలో పొటాషియం, సోడియం ఎక్కువగా ఉన్నవాళ్లు సైతం కొబ్బరి నీళ్లు తీసుకోకూడదు. గుండె సంబంధిత సమస్యలతో బాధ పడేవాళ్లు సైతం కొబ్బరి నీళ్లకు దూరంగా ఉంటే మంచిదని చెప్పవచ్చు. కొబ్బరి నీళ్లు తాగితే అలర్జీ లాంటి సమస్యలు వచ్చేవాళ్లు సైతం ఈ నీటికి దూరంగా ఉండాలి.

కొంతమంది ఎక్కువ మొత్తంలో కొబ్బరి నీటిని తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అయితే ఆ విధంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి నష్టం కలిగే అవకాశాలు అయితే ఉంటాయి. శరీర ఆరోగ్యానికి అనుగుణంగా కొబ్బరి నీళ్లు తీసుకోవడంపై దృష్టి పెడితే మంచిది. మితిమీరి కొబ్బరి నీళ్లు తీసుకోవడం మాత్రం ఆరోగ్యానికి మంచిది కాదు.