Gallery

Home Health & Fitness Body Heat: శరీరంలో వేడి తగ్గాలంటే ఈ ఆహారం తీసుకుంటే బెటర్..!

Body Heat: శరీరంలో వేడి తగ్గాలంటే ఈ ఆహారం తీసుకుంటే బెటర్..!

Body Heat: సాధారణంగా మన శరీరంలో వేడి 98.6 డిగ్రీల ఫారన్ హీట్.. 37 డిగ్రీల సెల్సియస్ అవసరం. అంత కంటే వేడి పెరిగితే అనారోగ్యానికి గురవుతాం. తలనొప్పి, జ్వరం, నీరసం, దగ్గు, జలుబు, వికారం, అజీర్తి, ఆకలి లేకపోవడం జరుగుతాయి. ప్రస్తుత కరోనా రోజుల్లో వీటిలో ఏది వచ్చినా కరోనా సోకిందా.. అనే అందోళన వచ్చేస్తోంది. కొందరికి శరీరీం ఎప్పుడూ వేడిగానే ఉంటుంది. మన శరీర వేడిని కొన్ని ఆహార పదార్ధాల ద్వారా కూడా తగ్గించుకోవచ్చు.

How To Reduce Body Heat 2 1 | Telugu Rajyam

పసుపులో కర్క్యుమిన్ అనే పోషకం బాడీలో వేడిని చాలా తగ్గిస్తుంది. మన పెద్దలు కూడా పసుపు పాలు, కూరల్లో కొద్దిగా పసుపు వేస్తూంటారు. ఒక్క గ్రాము పసుపు వాడినా ఫలితం ఉంటుంది. కూరగాయల్లో టమాటాల్లో మంచి పోషకాలు ఉంటాయి. ఇవి వేడి తగ్గించడంలో బాగా పని చేస్తాయి. బ్రకోలీ ఒక ఆకు కూర వంటిది. ఇందులో ఎక్కువ పోషకాలు ఉంటాయి. దీనిలోని యాంటీఆక్సిడెంట్లు మన శరీరంలోని వేడిని తగ్గిస్తాయి. వేడి తగ్గాలంటే బ్రకోలీ కూర తింటే మంచిది. పుట్టగొడుగులు కూడా వేడిని తగ్గిస్తాయి. ఇవి తినేవారు తక్కువ. కానీ.. వేడిని తగ్గించే మంచి ఆహారం.

పండ్లలో పచ్చ ద్రాక్ష చాలా మంచిది. బాడీ వేడిని తగ్గించేందుకు బాగా పని చేస్తుంది. ఇందులోని యాంటోసియానిన్స్ బాడీ టెంపరేచర్‌ని తగ్గిస్గాయి. ఫ్రజ్ నుంచి తీసినా కూలింగ్ పోయాకే తినాలి. పియర్స్ పండ్లు సీజనల్ పండ్లు. కానీ.. ఇవి వేడిని బాగా తగ్గిస్తాయి. జ్వరం ఉన్నా.. ఒళ్లు వేడిగా ఉన్నా రోజూ 3 పండ్లు తింటే వేడి తగ్గుతుంది.

ప్రస్తుతం అంతా గ్రీన్ టీ మయం. ఎక్కువమంది గ్రీన్ టీ మాత్రమే తాగుతున్నారు. గ్రీన్ టీలో వేడిని తగ్గించే గుణాలున్నాయి. ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిది. చాక్లెట్స్ లో డార్క్ చాకొలెట్‌ బెటర్. ఇందులో కోకో ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. బాడీలోని వేడిని లాగేస్తుంది. ఫ్రిజ్ లో ఉంటే తీసి కూలింగ్ తగ్గాక తినాలి. ముఖ్యమైన విషయం ఏంటంటే.. వేడి తగ్గేందుకు మంచి ఆహారం తీసుకుంటూ.. వేడిని పెంచే జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, ఫ్రై, ఫ్రై చికెన్, పొటాటో చిప్స్.. వంటివి తినకూడదు.

 

గమనిక: ఈ వివరాలు మీ అవగాహన కోసం మాత్రమే. పలు సందర్భాల్లో ఆహార నిపుణులు, వైద్యులు అందించిన వివరాలనే ఇక్కడ ఇచ్చాం. మీ ఆరోగ్యం విషయంలో ఎటువంటి సమస్య ఉన్నా, సలహాలకైనా వైద్యులను, ఆహార నిపుణులను సంప్రదించడమే ఉత్తం. మీ ఆరోగ్యానికి సంబంధించి ‘తెలుగు రాజ్యం’ ఎటువంటి బాధ్యత వహించదు. గమనించగలరు.

- Advertisement -

Related Posts

Yoga Day 2021: నేడే ‘యోగా డే’..! ప్రపంచవ్యాప్తంగా యోగాసనాలు

Yoga Day 2021: ‘యోగా’ను రోజువారీ దినచర్యగా భావిస్తున్నారు ప్రజలు. ప్రపంచం మొత్తం యోగా వల్ల కలిగే ప్రయోజనాలు గుర్తించింది. దేశాలు, భాషలు, సంస్కృతులు వేరైనా.. యోగా మాత్రం అందరినీ ఒక్కటి  చేసింది....

Yoga: వారానికో గంటైనా ‘యోగా’ చేస్తే.. ఈ రుగ్మతల నుంచి బయటపడొచ్చు..!!

Yoga: పురాతనమైన యోగాపై కొన్నేళ్ల క్రితమే అవగాహన పెరిగింది. గతంలో నిర్లక్ష్యానికి గురైన యోగా మళ్లీ పుంజుకుంది. మానసిక ప్రశాంతత, ఆరోగ్యం కోసం యోగా.. అని ప్రజలు విశ్వసించడమే ఇందుకు కారణం. దీంతో...

Coffee & Tea: ఉదయాన్నే.. ఖాళీ కడుపుతో కాఫీ, టీ మానేయాలట..! ఎందుకంటే..

Coffee & Tea: బెడ్ కాఫీ ఎంతోమందకి అలవాటు. కొందరు టీ తాగుతారు. ఎక్కువమందికి ఉదయం లేవగానే ఈ బెడ్ కాఫీ లేదా టీ తాగనిదే ఏ పనీ చేయలేరు. అసలు వారికి...

Latest News