మనలో చాలామంది వ్యవసాయంపై ఆసక్తి చూపడం లేదు. ఫలితంగా రోజురోజుకు వ్యవసాయం చేసేవాళ్ల సంఖ్య తగ్గుతోంది. భవిష్యత్తులో వ్యవసాయానికి ఊహించని స్థాయిలో డిమాండ్ ఏర్పడుతుందని కూరగాయలు, వాణిజ్య పంటల ధరలు కళ్లు చెదిరే స్థాయిలో పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. చాలామంది తెల్ల బంగారంగా జీడిపప్పును పిలుస్తారనే సంగతి తెలిసిందే.
ప్రపంచ దేశాలలొ జీడిపప్పు ఉత్పత్తిలో మన దేశం నంబర్ వన్ స్థానంలో ఉంది. రైతులు ఈ మధ్య కాలంలో ఈ పంట సాగుపై ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. ఈ పంట సాగుకు ఎక్కువ పెట్టుబడి సైతం అవసరం లేదు. పంట గురించి పూర్తిస్థాయిలో అవగాహన ఉండటంతో పాటు మంచి భూమి ఉంటే ఈ పంటను సాగు చేయవచ్చు. వేసవికాలం జీడిపప్పు సాగుకు అనుకూల కాలం కావడం గమనార్హం.
జీడిపప్పు చెట్లు ఎక్కువ ఎత్తు పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక రాష్ట్రంలో జీడిపప్పు సాగు ఎక్కువగా జరుగుతోంది. ప్రస్తుతం వంటల్లో జీడిపప్పు వినియోగం అంచనాలకు మించి పెరుగుతోంది. ఈ రీజన్ వల్లే జీడిపప్పుకు ఊహించని స్థాయిలో డిమాండ్ ఏర్పడుతోంది. రోజూ జీడిపప్పు తినడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను సైతం పొందవచ్చు.
వంటకాల రుచిని మెరుగుపరచడంలో జీడిపప్పు ఎంతగానో సహాయపడుతుంది. నరాల, కండరాల పనితీరును జీడిపప్పు మెరుగుపరుస్తుందని చెప్పవచ్చు. శరీర బరువును తగ్గించడంలో జీడిపప్పు సహాయపడుతుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు వయస్సుతో సంబంధం లేకుండా అందరూ జీడిపప్పును తీసుకోవచ్చు. తక్కువ పెట్టుబడితో ఈ పంట ఎక్కువ లాభాలను అందిస్తోంది.