రోజురోజుకు పెరుగుతున్న కంటి చూపు సమస్యలు.. ఈ ఆహార పదార్థాలతో సమస్యకు చెక్ పెట్టండి!

ప్రస్తుత కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లు పెరుగుతున్న పని ఒత్తిడి కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ఈ కాలంలో అందరినీ ఎక్కువగా వేధిస్తున్న సమస్యలను కంటిచూపు సమస్యలు కూడా ప్రధానమైనవిగా చెప్పవచ్చు. మన శరీరంలో కళ్ళు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఎంతో సున్నితంగా ఉండే కళ్ళు ప్రపంచాన్ని మనకు చూపిస్తాయి. కంటి చూపు లేకపోతే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందు వల్ల కంటి చూపుని కాపాడుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా ఈ రోజుల్లో లాప్టాప్, ఫోన్, టీవీలు ఎక్కువగా చూడటం వల్ల ఈ కంటి సంబంధిత సమస్యలు మరింత పెరుగుతున్నాయి. అందువల్ల లాప్టాప్, ఫోన్, టీవీలకు దూరంగా ఉండటమే కాకుండా కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల కంటిచూపు సమస్యల నుండి విముక్తి పొందవచ్చు.

శాస్త్రవేత్తల అధ్యయనం ప్రకారం శరీరంలో విటమిన్ ఇ, విటమిన్ సి, ఐరన్, కాపర్ , బీటా కెరటిన్ వంటి పోషకాల లోపించటం వల్ల కంటి సంబంధిత సమస్యలు మొదలవుతాయి. అందువల్ల ఈ పోషకాలు కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల కంటిచూపు మెరుగుపడేటమే కాకుండా అనేక ఆరోగ్య సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. అందువల్ల ఈ పోషకాలు ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను రోజూ తీసుకోవడం వల్ల కంటిచూపు సమస్యలను దూరం చేయవచ్చు.

ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో క్యారెట్ తీసుకోవడం చాలా అవసరం. ప్రతిరోజు క్యారెట్ పచ్చిగా కానీ , ఉడికించిన క్యారెట్ ని తినటం వల్ల అందులో ఉండే బీటా కెరటిన్, విటమిన్ ఏ కంటి ఆరోగ్యాన్ని సంరక్షించడమే కాకుండా కంటి చూపును కూడా మెరుగుపరుస్తాయి. అందువల్ల ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో క్యారెట్ తప్పనిసరిగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

తరచుగా చేపలు తినటం వల్ల కూడా కంటి ఆరోగ్యం మెరుగు పడుతుంది. చేపలలో ఒమేగా త్రీ ఫ్యాక్టరీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. అందువల్ల వారంలో రెండుసార్లు చేపలు తినటం వల్ల కంటి చూపు మెరుగు పడుతుంది. అంతేకాకుండా మనం తీసుకొని ఆహారంలో క్యాప్సికం చేర్చుకోవడం వల్ల కూడా కంటి చూపు మెరుగుపడుతుంది. ఎర్ర రంగులో ఉండే రెడ్ బెల్ పెప్పర్ ఆహారంగా తీసుకోవడం వల్ల అందులో ఉండే విటమిన్ సి కంటి ఆరోగ్యాన్ని సంరక్షించడంలో ఉపయోగపడుతుంది. రెడ్ బెల్ పెప్పర్ తినడం వల్ల ఇందులో ఉండే విటమిన్ ఏ, విటమిన్ ఇ కంటి చూపును మెరుగు పరుస్తాయి. అంతే కాకుండా కళ్ళల్లో ఉండే రక్తనాళాలు బలపడటానికి రెడ్ బెల్ పెప్పర్ ఎంతో ఉపయోగపడుతుంది.