ఆధునిక కాలంలో రోజురోజుకు పెరుగుతున్న అనారోగ్య సమస్యల కారణంగా ఆహారాన్ని తీసుకునే విషయంలో ప్రతి ఒక్కరు అనేక జాగ్రత్తలను పాటిస్తున్నారు. ముఖ్యంగా ఖాళీ కడుపుతో ఎలాంటి ఆహారం తీసుకోవాలన్న సందేహం చాలా మందిలో తలెత్తుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ విషయం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. న్యూట్రిషన్ నిపుణులు సూచించిన దాని ప్రకారం అన్ని ఆహార పదార్థాలు ఖాళీ కడుపుతో అసలు తినకూడదని సూచిస్తున్నారు. అయితే ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఎలాంటి ఆహార పదార్థాలను తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రతిరోజు ఉదయాన్నే అల్పాహారంలో సంపూర్ణ పోషకాలు సమృద్ధిగా లభించే ఓట్స్ ను ఆహారంగా తీసుకుంటే సులువుగా జీర్ణం అయ్యి నెమ్మదిగా శక్తి విడుదల చేస్తుంది కావున రోజంతా మీరు చురుగ్గా పనిచేసుకోగలుగుతారు. మరియు చక్కెర నిల్వలు రక్తంలో నిదానంగా కలుస్తాయి కాబట్టి షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి.
ప్రతిరోజు ఉడకబెట్టిన గుడ్డును ఆహారంగా తీసుకుంటే నిత్య జీవక్రియలకు అవసరమైన విటమిన్ ఏ, విటమిన్ డి, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, మంచి కొవ్వు ఆమ్లాలు, శక్తివంతమైన ఎంజైమ్స్, ఐరన్ పొటాషియం క్యాల్షియం వంటి ఖనిజలవనాలు సమృద్ధిగా లభిస్తాయి కావున ఉదయాన్నే అల్పాహారంలో తీసుకుంటే మనలో పోషకాహార లోపాన్ని తొలగించుకోవచ్చు.
ప్రతిరోజు అల్పాహారంలో అరటిపండు, ఆపిల్, స్ట్రాబెర్రీ, బొప్పాయి ఆహారంగా తీసుకుంటే వీటిల్లో ఉండే సహజ యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, ప్రోటీన్స్, ఫైబర్ వంటి చాలా రకాల పోషక పదార్థాలు మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించి అన్ని రకాల ఇన్ఫెక్షన్లు, అలర్జీల నుంచి మనల్ని రక్షిస్తాయి.
ఖాళీ కడుపుతో పెరుగును తింటే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు పెరుగులో ప్రోబయాటిక్స్ అధికంగా ఉండి జీర్ణ వ్యవస్థను బలవపేతం చేస్తాయి మరియు శరీర బరువు నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది.
ప్రతిరోజు ఉదయాన్నే అన్ని రకాల ఆకుకూరలతో రుచికరమైన సూప్స్, సలాడ్స్, జ్యూస్ వంటివి తయారు చేసుకొని సేవిస్తే మన శరీరానికి అవసరమైన ఐరన్ పోలిక్ యాసిడ్ సమృద్ధిగా లభిస్తుంది. మరియు ఆకుకూరల్లో అత్యధికంగా లభించే మెగ్నీషియం ఇనిస్టాండ్ ఎనర్జీగా సహాయపడి రోజంతా మిమ్మల్ని అలసిపోనివ్వకుండా ఉంచడంలో సహాయపడుతుంది.