మన శరీరానికి ఏ వంటకాల వల్ల హాని జరుగుతుందో ఆ వంటకాలను తినడానికే మనం చాలా సందర్భాల్లో ఆసక్తి చూపుతూ ఉంటాం. వినడానికి ఒకింత ఆశ్చర్యంగా అనిపించినా మైదాపిండితో చేసిన వంటకాలు ఆరోగ్యానికి ఎంతో హాని చేస్తాయి. బాగా పాలిష్ చేసిన గోధుమలను ఉపయోగించి మైదా పిండిని తయారు చేస్తారు. ఈ పిండి తెల్లగా కనిపించడం కోసం కొన్ని కెమికల్స్ ను యాడ్ చేయడం జరుగుతుంది.
మైదా పిండి తయారీలో పొటాషియం బ్రొమైట్ ను యాడ్ చేయడం జరుగుతుంది. ఈ రీజన్ వల్లే గోధుమ పిండితో పోల్చి చూస్తే మైదా పిండి ఖరీదు తక్కువగా ఉంటుంది. తినడానికి రుచిగా అనిపించినా మైదా పిండి వల్ల కలిగే నష్టాలు అన్నీఇన్నీ కావు. మైదాను తింటే బూడిద తిన్నట్టేనని వైద్యులు చెబుతున్నారంటే ఈ మైదా ఎంత ప్రమాదకరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఎవరైతే మైదాతో చేసిన వంటకాలను ఎక్కువగా తింటారో వాళ్లలో శక్తి క్రమంగా క్షీణిస్తుంది. పరోటా, రుమాలి రోటీ, కేకులు తినడం వల్ల ఆరోగ్యానికి చెడు జరిగే అవకాశం ఉంటుంది. బ్రెడ్, హల్వా, జిలేబీల తయారీలో కూడా మైదాను ఉపయోగించడం జరుగుతుంది. ఈ వంటకాలకు వీలైనంత దూరంగా ఉంటే మంచిదని చెప్పవచ్చు. మైదా వంటకాలను ఎక్కువగా తీసుకుంటే క్యాన్సర్ బారిన పడే ఛాన్స్ ఉంటుంది.
ఇప్పటికే ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లు మైదాపిండితో చేసిన వంటకాలను తినకుండా ఉంటే మంచిదని చెప్పవచ్చు. మైదా వల్ల తీవ్రస్థాయిలో నష్టాలు ఉన్న నేపథ్యంలో వీలైనంత దూరంగా ఈ ఉత్పత్తులకు ఉంటే మంచిది. ఈ ఉత్పత్తుల వల్ల ఆరోగ్యానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా నష్టం తప్ప లాభమైతే ఉండదు.