ఒంట్లో చెడు కొలెస్ట్రాల్ తగ్గించుకొని సులువైన మార్గాలివే!

ఈ రోజుల్లో చెడు కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడేవారు నానాటికి ఎక్కువ అవుతూనే ఉన్నారు దీనికి గల కారణాలను పరిశీలిస్తే క్రమ పద్ధతి లేని ఆహారపు అలవాట్లు,శారీరక శ్రమ లోపించడం వంటి కారణంగానే ఒంట్లో మోతాదుకు మించి కొవ్వు నిల్వలు పేరుకుపోయి చివరకు ఉబకాయం, రక్త పోటు, గుండె జబ్బులు, స్థూలకాయ వంటి అనేక సమస్యలు తలెత్తుతాయి. ఇలాంటి అనారోగ్య సమస్యల నుంచి భవిష్యత్తులో రక్షణ పొందాలంటే మన శరీరానికి వ్యాయామం, నడక, సైకిల్ ,స్విమ్మింగ్ వంటి వాటితో శ్రమను కల్పించడంతోపాటు కొన్ని ఆహార నియమాలు తప్పనిసరిగా పాటించాలి.

చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో మెంతి గింజలు అద్భుత ఔషధంలా పనిచేస్తాయి ఇందుకోసం మీరు చేయవలసిందల్లా రోజు వారి ఆహారంలో మెంతులను ఉపయోగిస్తూనే ప్రతిరోజు మెంతి కషాయాన్ని సేవిస్తే ఇందులో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, ట్రై గ్లిజరాయిడ్స్ చెడు కొలెస్ట్రాల్ ను సులువుగా తగ్గిస్తుంది. ప్రతిరోజు ఉదయాన్నే నానబెట్టిన ఎండుద్రాక్షను తింటే ఇందులో ఉండే ఫైటో కెమికల్స్, ప్లేవనాయిడ్ వ్యాధి నిరోధక శక్తి పెంపొందించడంతోపాటు ఒంట్లో చెడు కొలెస్ట్రాలను తగ్గించడంలో కీలకంగా వ్యవహరిస్తుంది.

ప్రతిరోజు గుప్పెడు బాదాం గింజల తింటే ఇందులో ఉండే ఒమేగా ఫ్యాటీ ఆసిడ్స్ చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయి. మరియు మంచి కొవ్వు ఆమ్లాలను పెంచుతాయి. సన్ ఫ్లవర్ విత్తనాలు, గుమ్మడి గింజలు, అవిసె గింజల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, పొటాషియం రక్తనాళాలను శుభ్రం చేసి రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి.రోజువారి ఆహారంలో బీన్స్ తింటే వీటిలో ఉండే ఔషధ గుణాలు శరీర బరువును తగ్గించడంతోపాటు చెడు కొలెస్ట్రాల్ నియంత్రిస్తాయి.