Headache: ప్రస్తుత కాలంలో కాలం ఎంతో వేగంగా పరిగెట్టడంతో మనం కూడా కాలంతో పాటు పరుగులు పెడుతూ ఉన్నాము. అందుకే పగలు రాత్రి అనే తేడా లేకుండా పోతుంది. చాలామంది వారి వృత్తి రీత్యా రాత్రిపూట కూడా పనిచేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇలా రాత్రిపూట మన శరీరానికి విశ్రాంతి లేకుండా పని చేయడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే చాలామందికి ఉదయం నిద్ర లేవగానే తల మొత్తం భారంగా నొప్పిగా ఉంటుంది.
ఇలా ఉదయం నిద్ర లేవగానే ఇలా తలనొప్పిగా అనిపించడానికి కారణం లేకపోలేదు కొంతమంది నైట్ షిఫ్ట్ డ్యూటీ చేసి ఆలస్యంగా పడుకోవడం వల్ల ఇలాంటి సమస్యలు తలెత్తుతుంటాయి మన శరీరానికి ఎప్పుడైతే సరైన నిద్ర ఉండదు ఆ క్షణం మనం నిద్రలేచినప్పుడు తల మొత్తం భారంగా ఉంటుంది. అందుకే వీలైనంతవరకు రాత్రి తొందరగా పడుకోవడానికి ప్రయత్నం చేయాలి అంతే కాకుండా లాప్టాప్స్ మొబైల్ టీవీ వంటి వాటిని వీలైనంతవరకు రాత్రిపూట వాడటం తగ్గించాలి.
ఇలా ఉదయం లేవగానే తల నొప్పిగా పట్టేసినట్టు ఉంటే వెంటనే ఒక గ్లాస్ నీటిని తాగటం వల్ల ఈ తలనొప్పి సమస్య నుంచి బయటపడవచ్చు. ఇక చాలా మంది రాత్రి ఆలస్యంగా పడుకుంటారు అయితే రాత్రి ఆలస్యంగా పడుకునేవారు మధ్యలో చాక్లెట్స్ తినడం కాఫీలు తాగడం వంటివి చేస్తుంటారు ఇలా అసలు చేయకూడదు. రాత్రి పడుకోవడానికి ముందు ఒక గ్లాస్ నీటిని తాగి పడుకున్నా కూడా ఇలాంటి సమస్య రాదని నిపుణులు చెబుతున్నారు. లా నీటిని తాగి పడుకోవడం వల్ల మన శరీరం డీ హైడ్రేషన్ కి గురి కాదు ఎప్పుడైతే మన శరీరం డీ హైడ్రేషన్ కి గురి అవుతుందో ఆ సమయంలోనే తల మొత్తం పట్టేసినట్టు నొప్పిగా అనిపిస్తుంది.