తరచూ చెవిపోటు సమస్యతో బాధ పడుతున్నారా.. ఈ సమస్యకు చెక్ పెట్టే అదిరిపోయే చిట్కాలివే!

మనలో చాలామంది ఏదో ఒక సందర్భంలో చెవిపోటుతో బాధ పడుతూ ఉంటారు. చెవిపోటు సమస్య విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కొన్నిసార్లు ప్రాణాలకు అపాయం కలుగుతుంది. అయితే కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా చెవిపోటు సమస్య దూరమయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు చెవిలో వచ్చే ఇన్ఫెక్షన్లు ఎంతో ఇబ్బంది పెడుతున్నాయి.

చెవినొప్పి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వినికిడి సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. చెవినొప్పి కొన్నిసార్లు ట్రాన్సిల్స్ సమస్యతో పాటు ఇతర సమస్యలకు కారణమవుతుంది. కోల్డ్ వార్మ్ కంప్రెస్ సహాయంతో చెవినొప్పిని దూరం చేయవచ్చు. శుభ్రమైన గుడ్డను నీటిలో తడిపి నొప్పి ఉన్నచోట అప్లై చేస్తే మంచిది. హీటింగ్ ప్యాడ్ లేదా కూలింగ్ ప్యాడ్ ఉపయోగించి చెవిపోటుకు చెక్ పెట్టవచ్చు.

చ్యూయింగ్ గమ్ నమలడం ద్వారా ఈ సమస్యను దూరం చేసుకోవచ్చు. నిటారుగా నిద్రించడం ద్వారా కూడా చెవినొప్పిని దూరం చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఇయర్ డ్రాప్స్ వాడటం ద్వారా కూడా చెవినొప్పిని దూరం చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. చెవినొప్పి ఎక్కువగా వేధిస్తుంటే వైద్యుల సలహాలు, సూచనలు తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు.

ఎసిటమైనోఫెన్, ఇబుప్రోఫెన్ లేదా నాప్రోక్సెన్ లాంటి ఔషధాలను వాడటం ద్వారా కూడా చెవినొప్పిని దూరం చేసుకోవచ్చు. కొన్నిసార్లు చెవినొప్పిని దూరం చేసుకోవడానికి ఆపరేషన్ పై ఆధారపడాల్సి ఉంటుంది. చెవినొప్పి వల్ల మన దేశంలో చాలామంది ఇబ్బంది పడుతున్నారు.