సమ్మర్ లో అలోవెరా జెల్ తో మీ అందాన్ని రెట్టింపు చేసుకోండిలా?

వేసవికాలంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఒంట్లో తేమ మొత్తం ఆవిరై చర్మం పొడిబారడం ఒక సమస్య అయితే మరో సమస్య పొడి వాతావరణం కారణంగా అధిక మొత్తంలో దుమ్ము, దూళికణాలు వాతావరణంలో చేరి అనేక చర్మం అలర్జీలకు కారణమవుతుంటాయి.ఈ సమస్య నుంచి సహజ పద్ధతిలో బయటపడాలంటే మనందరికీ అందుబాటులో ఉండే కలబంద గుజ్జు ఒక్కటే చక్కటి పరిష్కారమని నిపుణులు చెబుతున్నారు.అలోవెరా జెల్ లో చర్మ కణాల ఆరోగ్యాన్ని పెంపొందించే కొల్లాజన్ ప్రోటీన్ ఉత్పత్తిని పెంచే అద్భుత గుణాలు ఉన్నాయి మరియు విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ ఈ, శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఏజింగ్ గుణాలు, యాంటీ మైక్రోబియన్ గుణాలు కలబంద గుజ్జులో పుష్కలంగా లభిస్తాయి.

మీ చర్మ సౌందర్యాన్ని సహజ పద్ధతిలో కాపాడుకోవాలంటే మీరు చేయవలసిందిగా రాత్రి పడుకునే ముందు ముఖాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకొని అలోవెరా జెల్ ను అప్లై చేసుకుని ఉదయాన్నే ముఖాన్ని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా వారంలో రెండు మూడు సార్లు ప్రయత్నిస్తే చర్మానికి సహజ మాయిశ్చరైజర్ గా మారి చర్మాన్ని పొడిబారనివ్వదు. మరియు చర్మంపై ఉండే మృత కణాలు తొలగిపోయి చర్మం కాంతివంతంగా మారుతుంది. అలాగే ఈ టిప్స్ కూడా పాటించవచ్చు
ఒక కప్పులో కలబంద గుజ్జు ,విటమిన్ ఇ క్యాప్సిల్ వేసి బాగా కలపి ముఖంపై సున్నితంగా మర్దన చేసుకుని 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే మంగు మచ్చలు, మొటిమలు, నల్లటి వలయాలు తగ్గి చర్మం ప్రకాశవంతంగా తయారవుతుంది.

వేసవి సీజన్లో అధిక సూర్యతాపం వల్ల చర్మం తొందరగా పొడి బారడమే కాకుండా నల్లగా కమిలిపోయినట్లు అవుతుంది. ఇలాంటి సమస్యకు చెక్ పెట్టాలంటే కలబంద గుజ్జును తీసుకుని ముఖ చర్మానికి, మెడ భాగంలో లేపనంగా రాసుకొని పది నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి ఇలా తరుచూ చేస్తూ ఉంటే కలబంద గుజ్జులోని విటమిన్ సి, విటమిన్ ఈ, బీటా కెరోటిన్, యాంటీ ఏజింగ్ గుణాలు చర్మంపై ఉన్న చనిపోయిన కణాలను తొలగించి ముఖంలో మెరుగును పెంచుతుంది. మరియు ఎల్లప్పుడు చర్మాన్ని ప్రేమగా ఉంచడంలో సహాయపడి చర్మ రంగు మారకుండా కాపాడుతుంది.