కాలంతో సంబంధం లేకుండా అన్ని కాలాలలో పుష్కలంగా లభించే వాటిలో అరటిపండు ఒకటి. ఇక అరటిపండు తినడానికి కూడా చాలామంది ఇష్టపడుతుంటారు.అరటిపండులో అధిక మొత్తంలో ఫైబర్ ఇతర పోషకాలు ఉండటం వల్ల జీర్ణక్రియ సమస్యలు లేకుండా మనం తీసుకున్న ఆహారం తేలికగా జీర్ణం కావడానికి దోహదపడుతుంది. అయితే అరటి పండులో ఎన్నో పోషకాలు ఉన్నప్పటికీ అరటి పండు కన్నా తొక్కలో మరిన్ని పోషకాలు ఉన్నాయని చెప్పాలి. అరటిపండు తొక్కలో ఆరోగ్య ప్రయోజనాలు కన్నా చర్మ సౌందర్య ప్రయోజనాలు అధికంగా ఉన్నాయని చెప్పాలి.
ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ సి, విటమిన్ బి6, విటమిన్ బి12, యాంటీఆక్సిడెంట్, యాంటీమైక్రోబయల్ లక్షణాలు ఉన్నాయి. ఇవన్నీ చర్మ సంబంధిత వ్యాధులను అలాగే చర్మం పై ఏర్పడిన మొటిమలు మచ్చలను తొలగించడానికి దోహదపడతాయి. శుభ్రంగా మొహం కడిగిన తర్వాత అరటిపండు తొక్కతో బాగా మొహానికి స్క్రబ్ చేయాలి. ఇలా చేయటం వల్ల చర్మంపై ఉన్నటువంటి మృత కణాలు తొలగిపోయి చర్మానికి తేమను కలిగించి చర్మం ఎంతో కాంతివంతంగా ఉండడానికి దోహదపడుతుంది.
ఇక అరటిపండు తొక్కలో ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది.ఇలా తొక్కతో సహా అరటిపండు తిన్నప్పుడు ఎలాంటి జీర్ణక్రియ సమస్యలు తలేత్తకుండా జీర్ణక్రియ సవ్యంగా జరుగుతూ మలబద్ధకాన్ని నివారిస్తుంది.ఇక ఇందులో విటమిన్ ఏ అధికంగా ఉండటం వల్ల కంటి చూపును మెరుగుపరచడానికి దోహదపడుతుంది. ఇక తీవ్రమైన తలనొప్పితో బాధపడేవారు అరటి తొక్కలో ఒక పది నిమిషాలు పాటు ఫ్రిడ్జ్ లో ఉంచి అనంతరం తలపై వేసుకోవడం వల్ల తొందరగా తలనొప్పి సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.