పాలు ఇలా మరిగించకపోతే ఆరోగ్య సమస్యలు వస్తాయట.. ఈ తప్పులు అస్సలు చేయొద్దు!

మనలో చాలామంది పాలు తాగడానికి ఎంతో ఇష్టపడతారు. పాలు తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని చెప్పడంలో ఎలాంటి సందేహం అయితే అవసరం లేదని చెప్పవచ్చు. పాలు తాగడం ద్వారా శరీరానికి అవసరమైన కాల్షియం, ప్రోటీన్, విటమిన్లు లభిస్తాయని చెప్పవచ్చు. పాలను సంపూర్ణ ఆహారం అని పిలుస్తారు. పాలను మరిగించి తాగడానికి ఇష్టపడతారనే సంగతి తెలిసిందే.

పాలను మరిగించడం ద్వారా అందులో ఉండే బ్యాక్టీరియ నశించే అవకాశాలు అయితే ఉంటాయి. పాలు మరిగించే సమయంలో కొన్ని తప్పులు మాత్రం అస్సలు చేయకూడదు. పాలను పదేపదే మరిగిస్తే పాలలోని పోషక విలువలు నశించే అవకాశాలు ఉంటాయి. పాలను ఒక్కసారి మాత్రమే మరిగించి తాగేముందు కొద్దిగా వేడి చేసుకునే అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు.

కొంతమంది మహిళలు పాలను తక్కువ మంట మీద ఎక్కువసేపు మరిగిస్తారు. ఇలా చేయడం ద్వారా ఎక్కువగా మీగడ వస్తుందని భావిస్తారు. తక్కువ మంట మీద పాలను ఎక్కువసేపు మరిగించడం వల్ల దాని పోషకాలు తగ్గుతాయని చెప్పవచ్చు. పాలను ఎల్లప్పుడూ మీడియం మంట మీద మరిగించి అప్పుడప్పుడు చెంచా లేదా గరిటెతో కలిపితే చాలని చెప్పవచ్చు.

పాలు మరిగించడానికి హై-ప్లేమ్ పెట్టడం కూడా మంచిది కాదు. పాలు తొందరగా మరిగించడం వల్ల అందులోని చక్కెర కరిగిపోతుందని చెప్పవచ్చు. మీడియం మంట మీద మరిగేటప్పుడు దానిలోని కొవ్వు, నీరు, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు కలిసిపోయే అవకాశాలు ఉంటాయి.