ముఖంపై జిడ్డు,మచ్చలు లేకుండా మెరవాలా.. అయితే ఈ చిన్న పని తోనే సాధ్యం!

ముఖంపై మచ్చలు, నలుపుతనం, స్నానం చేసిన కొద్దిసేపటికే జిడ్డు లాగా ఉండడం, ముఖంలో డల్ నెస్ కనపడడం లాంటి వాటి వల్ల కెమికల్స్ వాడి వీటి తీవ్రతను మరింత పెంచకుండా ఇంట్లో దొరికే సహజమైన పదార్థాలతో ముఖాన్ని తెల్లగా, కాంతి వలె మెరిసే విధంగా చేసుకోవచ్చు.

ఒక గిన్నెలో కాస్త పచ్చిపాలను తీసుకుని ఒక చిన్న కాటన్ ముక్కను అందులో అది ముఖానికి అంతా పూసుకోవాలి. ఒకవేళ కాచి చల్లార్చిన పాలు అయిన కూడా పర్వాలేదు. పాలు ముఖంపై మురికిని లోపలి నుంచి తీసేసి శుభ్ర పరుస్తాయి. మొటిమలు కూడా చాలావరకు తగ్గుతాయి. మొఖం ఎండిన తర్వాత వేరే గుడ్డతో మొత్తం తుడుచుకోవాలి.

తరువాత ఒక గిన్నెలో ఒక స్పూన్ గోధుమపిండి, ఒక స్పూన్ పచ్చిపాలను పేస్ట్ లాగా చేసుకుని ముఖంపై అప్లై చేసుకోవాలి. పదినిమిషాల తర్వాత తీసేస్తే ఫలితం వెంటనే గమనించవచ్చు. మొటిమలు, చిన్న చిన్న మచ్చలు, ముఖం యొక్క రంగు కాస్త మారినట్టుగా మొదటి సారి మనకు కనిపిస్తుంది. తర్వాత ముఖానికి స్ట్రీమింగ్ పెట్టుకోవాలి. ఎక్కువసేపు కాకుండా రెండూ లేదా మూడు నిమిషాలు అయితే సరిపోతుంది.

ఈ స్ట్రీమింగ్ ద్వారా కణాల లోపల ఏవైనా మొటిమలు, మచ్చలు రాకుండా మొదటిలోనే నిలిపివేయడానికి ఉపయోగపడుతుంది. వారానికి ఒకసారి మాత్రమే స్క్రీనింగ్ చేసుకోవాలి ఎందుకంటే చర్మం స్మూత్ గా ఉంటుంది కాబట్టి ఒకసారి సరిపోతుంది. తరువాత ఒక కప్పులో ఒక స్పూన్ ముల్తాన్ మట్టి, ఒక స్పూన్ ఆరెంజ్ పీల్ పౌడర్, ఒక స్పూన్ శాండిల్ పౌడర్, ఒక స్పూన్ పెరుగు, చిటికెడు పసుపు, కాస్త బీట్రూట్ లేదా టమాటా రసం వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి.

ఈ పేస్టును ముఖంపై అప్లై చేసి రెండు లేదా మూడు నిమిషాలు చేతి వేళ్లతో మృదువుగా మసాజ్ చేసుకోవాలి. ఒక 15 నిమిషాల తర్వాత ఫేస్ ను శుభ్రం చేసుకుంటే మొదటిసారి చక్కటి ఫలితం గమనించవచ్చు.