రోజులో ఎక్కువసేపు కూర్చుని పని చేస్తున్నారా… ఈ సమస్యలు తప్పవంటున్న నిపుణులు!

benefits-of-working-from-home

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా కూడా రోజువారిలో ఎక్కువసేపు కూర్చొని పనిచేస్తూ ఉన్నారు. ఇలా రోజులో దాదాపు 12 గంటల పాటు కూర్చొని పనిచేయడం వల్ల ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటూ బాధపడుతూ ఉన్నారు.ముఖ్యంగా సిస్టం ముందు కూర్చుని పని చేసే వారిలో తీవ్రమైన వెన్నునొప్పి సమస్యతో పాటు ఇతర సమస్యల బారిన పడ్డారని అలాగే అధిక ఒత్తిడి కారణంగా మెదడుపై కూడా ఈ ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు తెలియజేస్తున్నారు.

రోజులు ఎక్కువ సమయం సిస్టం ముందు కూర్చోవడం వల్ల తీవ్రమైన వెన్న నొప్పి సమస్యతో బాధపడే అవకాశాలు ఉంటాయి. అందుకే ప్రతి గంటకు ఒక్కసారైనా లేచి నడవాలని నిపుణులు చెబుతున్నారు. అలాగే ప్రతిరోజు సాయంత్రం మీకంటూ కాస్త సమయం కేటాయించి వ్యాయామం, వాకింగ్ వంటివి చేయడం వల్ల ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు.ఇక స్నానం చేసే సమయంలో గోరువెచ్చని నీటిలోకి రెండు చుక్కల యూకలిప్టప్స్ ఆయిల్ వేసుకొని స్నానం చేయడం వల్ల ఈ విధమైనటువంటి నొప్పులు ఉండవని నిపుణులు చెబుతున్నారు.

సాధారణంగా అధిక శరీర బరువు ఉన్న వారిలో ఈ విధమైనటువంటి వెన్నునొప్పి సమస్య అధికంగా ఉంటుంది. అలాగే సరైన నిద్ర లేకపోవడం వల్ల కూడా ఈ సమస్య మరింత అధికంగా ఉంటుంది.ఇలా వెన్నునొప్పి సమస్యతో బాధపడేవారు ప్రతిరోజు రాత్రి ఆవాల నూనెతో మసాజ్ చేయడం వల్ల ఈ నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు ఇలా చేస్తున్నప్పటికీ నొప్పి ఏమాత్రం తగ్గకపోతే వెంటనే వైద్యుని సంప్రదించి వైద్యుల సలహాలు సూచనలు పాటించడం ఎంతో అవసరం.