ఈ రోజుల్లో దాదాపు 60 శాతం మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. కారణం ఉరుకుల పరుగుల జీవన గమనంలో పని ఒత్తిడి కారణంగా మనం తీసుకునే ఆహారం నిత్య జీవక్రియలకు సరిపోదు. దాంతో పోషకాహార లోపం తలెత్తుతుంది.
పోషకాహార లోపాన్ని అధిగమించడానికి మన ఆహారంతోపాటు అత్యధిక పోషక విలువలు ఉన్న డ్రై ఫ్రూట్స్ ను ఆహారంగా తీసుకుంటే పోషకాహార లోపాన్ని సవరించుకోవచ్చునని వైద్యులు సూచిస్తున్నారు.
ప్రతిరోజూ ఉదయం నానబెట్టిన బాదంపప్పు తినడం వల్ల మన శరీరానికి అవసరమైన ప్రోటీన్స్, విటమిన్స్ తోపాటు పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం,జింక్, ఐరన్, యాంటి ఆక్సిడెంట్స్, పుష్కలంగా లభిస్తాయి. బాదంపప్పులో ప్రోటీన్స్ పుష్కలంగా ఉండి కేలరీలు తక్కువగా ఉండడం వల్ల ఉబకాయం , రక్త పోటు గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.
జీడిపప్పులో మన ఆరోగ్యాన్ని పరిరక్షించే ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు, ప్రొటీన్లు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్, కాల్షియం ,మెగ్నీషియం, పొటాషియం, పైబర్ వంటి పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. వీటిలో అధికంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్ చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని రక్షిస్తుంది.
పొటాషియం రక్తప్రసరణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.జీడిపప్పు లో ఉండే మెగ్నీషియం,యాంటీ ఆక్సిడెంట్లు, మెదడు కణాల అభివృద్ధికి తోడ్పడి జ్ఞాపక శక్తిని పెంపొందించడంతో పాటు జీవక్రియను నియంత్రిస్తుంది.
పిస్తా నట్స్‌లో విటమిన్ ఈ, కాల్షియం, సెలీనియం, కాపర్, మెగ్నీషియం, రైబోఫ్లేవిన్ పుష్కలంగా ఉంటాయి. వీటిలో ఐరన్, పొటాషియం, జింక్, విటమిన్ బి, నియాసిన్, థయామిన్, ఫోలేట్ కూడా సమృద్ధిగా ముఖ్యంగా రక్తంలోని చక్కెర స్థాయిని తగ్గించి మెటబాలిజాన్ని మెరుగు వస్తుంది. ఎముకలు కండరాల దృఢత్వానికి సహాయపడుతుంది.
రాత్రిపూట ఒక గ్లాసు నీళ్లలో కిస్‌మిస్‌ను నానబెట్టి పొద్దున్నే ఆ నీళ్లను తాగితే కడుపు శుభ్రం అవుతుంది. కిస్మిస్ ఆహారంగా తీసుకుంటే సంపూర్ణ పోషకాలు లభించడంతోపాటు జీర్ణ వ్యవస్థ మెరుగుపడి మలబద్ధకం వంటి సమస్యలను తొలగిస్తుంది.
డ్రై అంజుర,ఖర్జూరం పండ్లలో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. వారానికి కనీసం రెండుసార్లయినా వీటిని తినడం వల్ల ఎర్ర రక్తకణాలు అభివృద్ధి చెంది అనీమియాను దూరం చేస్తుంది.ఉదయం సాయంత్రం వీరిని అల్పాహారం గా కూడా తీసుకోవచ్చు.