ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో సూపర్ ఫుడ్ గా పిలవబడే చియా విత్తనాలను తీసుకున్నట్లయితే పోషకాహార లోపాన్ని సవరించుకోవచ్చునని వైద్యులు చెబుతున్నారు. చియా విత్తనాలు మన శరీర పోషణకు అవసరమైన మరియు మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడానికి అవసరమైన అన్ని ఔషధ గుణాలు పుష్కలంగా లభిస్తాయి. ముఖ్యంగా చియా విత్తనాల్లో అత్యధిక ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ లభించడంతోపాటు
విటమిన్ బి1,బీ2 బి3, పొటాషియం, ఐరన్ జింక్ , ఫాస్ఫరస్, మెగ్నీషియం వంటి మూలకాలు పుష్కలంగా లభిస్తాయి.
ఉబకాయం,అధిక శరీర బరువు సమస్యతో బాధపడేవారికి చియా విత్తనాలు చక్కటి పరిష్కార మార్గం చూపుతాయి. చియా విత్తనాలలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, కార్బో హైడ్రేట్లు, ఫైబర్ అధిక పరిమాణంలో ఉంటాయి. కావున ప్రతిరోజు 25 నుండి 38 గ్రాముల చియా విత్తనాలను ఉదయాన్నే ఆహారంగా తీసుకుంటే ఇందులో కొవ్వు ఆమ్లాలు శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ నీ తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
నిద్రలేమి సమస్య, మానసిక అనారోగ్య సమస్యతో బాధపడేవారు ప్రతిరోజు చియా గింజలను ఆహారంలో తీసుకున్నట్లయితే ఈ గింజల్లో పుష్కలంగా ఉన్న
సెరొటోనిన్ అనే పదార్థం నిద్రను కలగజేసే మెలనిన్ హార్మోన్స్ ఉత్పత్తిలో సహాయపడి నిద్రలేమి సమస్యను తొలగించడంతోపాటు మానసిక ప్రశాంతతను కలగజేస్తుంది.
చియా విత్తనాల్లో పుష్కలంగా ఉన్నాయి మెగ్నీషియం , జింకు, విటమిన్ బి3 నాడీ కణాల అభివృద్ధిలో సహాయపడి మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. వృద్ధాప్యంలో వచ్చే అల్జీమర్ వ్యాధిని అదుపు చేయడంలో సహాయపడుతుంది.
చియా గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండడం వల్ల మన శరీరంలోని క్యాన్సర్ కారక కణాలను అదుపు చేయడంలో సహాయపడి అనేక క్యాన్సర్ల నుండి మనల్ని రక్షిస్తాయి.చియా విత్తనాలల్లో ఉండే మోనో శాచురెటెడ్ చెడు కొలెస్ట్రాల్ తొలగించి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి.
డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు ప్రతిరోజు చియా విత్తనాలను ఆహారంలో తీసుకున్నట్లయితే వీటిలో అధికంగా ఉన్న ఫైబర్ రక్తంలోని గ్లూకోస్ స్థాయిలను నియంత్రించి డయాబెటిస్ ని అదుపు చేయడంలో సహాయపడుతుంది. అలాగే పీచు పదార్థం అధికంగా ఉండడంతో జీర్ణక్రియ సక్రమంగా జరిగి మలబద్ధకం , అజీర్తి వంటి సమస్యలను తొలగిస్తుంది.
చియా గింజల్లో ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి . శాఖాహారులకు ఇది ఉత్తమమైన ఆహారం ప్రోటీన్స్ అధికంగా ఉండడంతో ఎముకలు, దంతాలు దృఢంగా ఉండడానికి సహాయపడి వృద్ధాప్యంలో వచ్చే ఆర్థరైటిస్ , కీళ్ల నొప్పుల సమస్యలను అరికడుతుంది.