పచ్చి కొబ్బరిని తరచూ ఆహారంలో తీసుకుంటే… ఏం జరుగుతుందో తెలుసా?

కొబ్బరి చెట్టును కల్పవృక్షంగా భావిస్తారు. కొబ్బరి చెట్టులోని ప్రతి భాగము మనకు ఏదో ఒక విధంగా ఉపయోగపడుతుంది.కొబ్బరికాయ మన ఆరోగ్యాన్ని రక్షించడంతోపాటు సౌందర్యాన్ని పెంపొందించడంలో అద్భుతంగా సహాయపడుతుంది. చాలామంది కొబ్బరికాయలను దేవునికి నైవేద్యంగా పెట్టడానికి మాత్రమే ఉపయోగిస్తారు. పచ్చి కొబ్బరితో కొబ్బరి పాయసం, కొబ్బరి ఆల్వా ,కొబ్బరి పచ్చళ్ళు , స్వీట్స్ వంటి అనేక రకాల రుచికరమైన వంటకాలు తయారు చేసుకుని తినవచ్చు. పచ్చి లేత కొబ్బరిని తరచూ ఆహారంగా తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం.

పచ్చి లేత కొబ్బరిలో మన శరీరానికి అవసరమైన విటమిన్ సి, ఈ, కాల్షియం, ఫైబర్ ,మెగ్నీషియం, జింకు వంటి ఖనిజ లవణాలు పుష్కలంగా లభిస్తాయి. అలాగే లేత కొబ్బరిలో యాంటీ బ్యాక్టీరియల్, వైరల్ గుణాలు పుష్కలంగా ఉండడంతో సీజనల్గా వచ్చే అనేక రకాల వ్యాధులను ఎదుర్కొనే రోగ నిరోధక శక్తిని మనలో పెంపొందిస్తుంది.కొబ్బరిలో ఫైబ‌ర్ శాతం ఎక్కువగా ఉంటుంది దాంతో జీర్ణ వ్యవ‌స్థ పనితీరు మెరుగుపడి మలబద్ధకం వంటి సమస్యలు తొలగుతాయి.

పచ్చికొబ్బరిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్ శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించి గుండె పనితీరును మెరుగుపరుస్తుంది.రక్తపోటు, గుండెపోటు వంటి ప్రమాదాలను నివారించేందుకు ఉపయోగపడతాయి.
కొబ్బరిని క్రమం త‌ప్పకుండా తీసుకోవ‌డం వ‌ల్ల వీటిలో పుష్కలంగా ఉన్న మెగ్నీషియం మెదడు పనితీరును మెరుగుపరిచి అల్జీమ‌ర్స్ వంటి వ్యాధుల‌కు చెక్ పెట్టవ‌చ్చు.

కొబ్బరి నీళ్లలో పోషక విలువలతో పాటు ఔషధగుణాలు మెండుగా ఉన్నాయి.ముఖ్యంగా సోడియం, ఐరన్, పొటాషియం,మెగ్నీషియం,కాపర్‌,ప్రొటీన్లు,కార్బోహైడ్రేట్‌, మినరల్స్‌ ఉండటంతో కొబ్బరినీళ్ళను ప్రతిరోజు తాగితే మన శరీరంలో ఢీ హైడ్రేషన్ సమస్య ఏర్పడదు కొబ్బరి నీళ్లలో ఉండే ట్రాన్స్-జేజిటిన్ జ్ఞాపకశక్తిని పెంపొందించడంలో సహాయపడుతుంది.

కొబ్బరిలో విటమిన్ ఈ అధికంగా ఉండడం వల్ల చర్మ సమస్యలను దూరం చేస్తుంది. కొబ్బరి నూనెలో ఉన్నటువంటి లారిక్ ఆమ్లం,యాంటీ ఆక్సిడెంట్లు చర్మంను పొడిబారకుండా మృదువుగా ఉంచుతాయి. కొబ్బరి నూనెలో ఉన్న ఔషధ గుణాలు చుండ్రు సమస్యలను తొలగించి జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.