విటమిన్ సి సమృద్ధిగా ఉన్న కమలా పండును ప్రతిరోజు తినడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా?

సాధారణంగా పండ్లు ఆరోగ్యానికి ఎంతో మంచిది అని చెబుతారు. ఇలాప్రతిరోజు కొన్ని రకాల పండ్లను కలిపి తీసుకోవడం వల్ల డాక్టర్ దగ్గరకు వెళ్లే అవసరం లేకుండా మన ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు అని చెబుతుంటారు ఈ క్రమంలోనే సిట్రస్ జాతికి చెందిన కమలా పండ్లు ఎక్కువగా శీతాకాలంలో మనకు అందుబాటులో ఉంటాయి. వీటి అద్భుతమైన రుచిని, సువాసనని ఇష్టపడని వారంటూ ఎవ్వరు ఉండరు. ముఖ్యంగా కమలాపండ్లలో అత్యధిక విటమిన్ సి లభ్యమవుతుంది.ఇలా అత్యధికంగా విటమిన్సీ కలిగి ఉన్నటువంటి ఈ కమలా పండును ప్రతిరోజు తీసుకోవడం వల్ల ఏం జరుగుతుంది ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు అనే విషయానికి వస్తే…

రోజుకు రెండు కమలాపండ్లను ఆహారంగా తీసుకుంటే మన జీవక్రియలకు అవసరమైన సూక్ష్మ పోషకాలు మరియు స్థూల పోషకాలు సమృద్ధిగా లభించినట్లే. ఇందులో ఉన్న విటమిన్ సి మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడానికి సహాయ పడడమే కాకుండా మనం తీసుకునే ఆహారం నుంచి ఐరన్ మూలకాన్ని సమృద్ధిగా మన శరీరం గ్రహించడానికి తోడ్పడి రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది. ఇందులో ఉన్న పొటాషియం, ఐరన్ మరియు హెర్పెరెడిన్‌ అనే ఎంజైమ్‌ రక్తనాళాలను శుభ్రపరిచి రక్తప్రసరణ వ్యవస్థను వేగవంతం చేస్తుంది. దాంతో గుండె ఆరోగ్యము, అధిక రక్తపోటు వంటి సమస్యలు తొలగిపోతాయి. కమలాపండ్లలో సమృద్ధిగా ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ రక్తంలో గ్లూకోస్ స్థాయిలను నియంత్రిస్తాయి.

ఈ క్రమంలోనే డయాబెటిస్ సమస్యతో బాధపడే వారు రోజులు ఒక్క కమలా పండును కచ్చితంగా ఆహారంలో తీసుకోవాలి. అధిక బరువు సమస్యతో బాధపడేవారు ప్రతిరోజు కమలా పండ్లను ఆహారంగా తీసుకుంటే వీటిలో పుష్కలంగా ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్ సి మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. అలాగే మన శరీరంలోని క్యాన్సర్ కణాలను నిర్వీర్యం చేయడంలో చక్కగా సహాయపడుతుంది. ప్రతిరోజు కమల పండ్లను తినేవారు వృద్ధాప్య ఛాయాలను తరిమికొట్టవచ్చు.