కొబ్బరి నీళ్లను ఉదయాన్నే సేవిస్తే ఏం జరుగుతుందో తెలుసా?

కొబ్బరినీరు తరచూ తాగడం వల్ల మన శరీరాన్ని డిహైడ్రేషన్ సమస్య నుంచి కాపాడడమే కాకుండా మన శరీర పోషణకు అవసరమైన పొటాషియం, మెగ్నీషియం, క్యాల్షియం, సోడియం వంటి సహజ పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. మన శరీరం ఎలక్ట్రోలైట్ సమతౌల్యం కోల్పోయినప్పుడు కొబ్బరి నీరు తాగితే మన శరీరానికి సహజ లవణాలను అందించి అలసట, నీరసం వంటి సమస్యలను తొలగించి తక్షణ శక్తినిస్తుంది.

సాధారణంగా చాలామంది వేసవికాలంలోనూ లేదా మన ఆరోగ్యం బాగోలేనప్పుడే కొబ్బరి నీరును తాగడానికి ఆలోచన చేస్తుంటారు. అలా కాకుండా తరచూ కొబ్బరి నీరును తాగడం వల్ల అనేక అనారోగ్య సమస్యల నుంచి తప్పించుకోవచ్చు. సాఫ్ట్ డ్రింక్ మరి ఇతర జ్యూస్‌లతో పోలిస్తే కొబ్బరి నీళ్లల్లో చక్కెర, కార్బోహైడ్రేట్లు చాలా తక్కువగా ఉంటాయి. కావున అతి బరువు సమస్యతో బాధపడేవారు, చక్కర వ్యాధిగ్రస్తులు నిక్షేపంగా కొబ్బరి నీరును తీసుకోవచ్చు.

కొబ్బరి నీళ్లను తరచు తాగడం వల్ల వీటిలో పుష్కలంగా ఉన్న కాల్షియం ఎముకల్ని, పళ్ళను దృఢంగా ఉంచడమే కాకుండా కండరాల కదలికలను మెరుగుపరిచి కీళ్ల నొప్పులు, కండరాల వాపు వంటి సమస్యలను తగ్గిస్తుంది. కొబ్బరి నీళ్లల్లో చెడు కొలెస్ట్రాల్ నీ, ట్రై-గ్లిజరైడ్ స్థాయిలను నియంత్రించే గుణం ఉండడం వల్ల రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టకుండా అరికట్టి గుండెపోటు, బీపీ వంటి సమస్యలను తగ్గిస్తుంది.

కొబ్బరి నీళ్లల్లో పొటాషియం పరిమాణం ఎక్కువగా ఉండడం వల్ల రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. కొబ్బరి నీళ్లలో క్యాలరీలు తక్కువ ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల బయో ఎంజైమ్ నీ ఉత్పత్తి చేసి మనం తీసుకునే ఆహారాన్ని సులువుగా జీర్ణం అయ్యే విధంగా చేస్తుంది దాంతో మలబద్ధకం, అజీర్తి, గ్యాస్టిక్ వంటి సమస్యలు మన దరి చేరవు.

డయేరియా వంటి సమస్యలతో బాధపడేవారు కొబ్బరి నీళ్లను ఎక్కువగా తీసుకుంటే ఇందులో ఉండే ఔషధ గుణాలు విరేచనాలను తగ్గించి మనలో నీరసాన్ని తొలగిస్తుంది. ప్రతిరోజు ఉదయాన్నే కొబ్బరి నీళ్లను సేవిస్తే ఇందులో పుష్కలంగా ఉన్న మెగ్నీషియం, జింకు నాడీ కణాభివృద్ధికి తోడ్పడి మెదడును చురుగ్గా ఉంచడమే కాకుండా జ్ఞాపకశక్తిని పెంపొందిస్తుంది.