కొబ్బరినీళ్లు ఆరోగ్యానికి చాలా మంచిది అన్న విషయం మనందరికీ తెలిసిందే. కొబ్బరి నీళ్లలో సమృద్ధిగా మన శరీరానికి అవసరమైన విటమిన్స్ , మినరల్స్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఖనిజలవనాలు, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బయోటిన్ గుణాలు సమృద్ధిగా లభిస్తాయి.కొబ్బరి నీళ్లలో పుష్కలంగా లభించే ఎలక్ట్రోలైట్స్ శరీరంలో నీటి శాతాన్ని పెంచి అవయవాల పనితీరును మెరుగుపరచడమే కాకుండా డిహైడ్రేషన్ సమస్య నుంచి కూడా మనల్ని రక్షిస్తుంది. రోజుకొక కొబ్బరి బొండం సేవిస్తే రోజంతా రోజంతా మిమ్మల్ని చురుగ్గా ఉంచి నీరసం అలసట వంటి లక్షణాలను తొలగించడమే కాకుండా మానసిక ఒత్తిడిని దూరం చేసి మెదడు ఆరోగ్యాన్ని జ్ఞాపక శక్తిని పెంపొందించడంలో సహాయపడుతుంది.
కొబ్బరి నీళ్లల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొన్ని రకాల అనారోగ్య సమస్యలతో బాధపడేవారు మాత్రం వీటికి దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు ముఖ్యంగా అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతూ చికిత్స తీసుకునేవారు అధికంగా కొబ్బరి నీళ్లను సేవిస్తే సమస్య తప్పదు అంటున్నారు నిపుణులు. కారణం రక్తపోటు నియంత్రణ మందులు వాడేవారు కొబ్బరినీళ్లను అధికంగా సేవిస్తే లో బీపీ సమస్య తలెత్తవచ్చు.
తీవ్రమైన జలుబు, గొంతు నొప్పి లక్షణాలతో బాధపడేవారు కొబ్బరి నీళ్లను సేవిస్తే మరీ ముఖ్యంగా రాత్రి సమయాల్లో సేవిస్తే సమస్య మరింత తీవ్రమవుతుంది. జీర్ణ సంబంధ సమస్యలతో బాధపడేవారు ఒక గ్లాసుడు కొబ్బరి నీళ్ల కంటే ఎక్కువ మోతాదులో సేవిస్తే జీర్ణ రసాలు పలుచబడి జీర్ణం అవడంలో ఆలస్యం జరిగి గ్యాస్ట్రిక్ ,ఉబ్బసం విరోచనాలు, వాంతులు వంటి సమస్య తలెత్తవచ్చు.
కొన్ని అధ్యాయనాల ప్రకారం ఉబ్బసం, కిడ్నీ సమస్యలు ఉన్నవారు కొబ్బరినీళ్లను అధికంగా తాగితే తీవ్ర అనారోగ్య సమస్యలు కారణం కావలసినవి నిపుణులు చెబుతున్నారు.కొబ్బరి నీళ్లలో అత్యధికంగా పొటాషియం, మెగ్నీషియం నిల్వలు లభ్యమవుతాయి. మన శరీరంలో పొటాషియం మోతాదుకు మించి పెరిగితే జీవక్రియలో వ్యత్యాసం ఏర్పడి కళ్ళు తిరిగి పడిపోవడం, లో బిపి, కాళ్లు చేతులు తిమ్మిర్లు వంటి సమస్యలు తలెత్తుతాయి.