ఆడపిల్లలను ఎక్కువగా వేధించే ఆరోగ్య సమస్యలలో మొటిమల సమస్య కూడా ఒకటి. ఈ సమస్య చిన్న సమస్యలా అనిపించినా ఈ సమస్య వల్ల ఎంతోమంది ఆడపిల్లలు ఆత్మనూన్యతతో బాధ పడుతున్నారు. మొటిమల సమస్య వల్ల ముఖంపై మచ్చలు ఏర్పడటంతో పాటు ఆ మచ్చలు దీర్ఘకాలం ఉండే అవకాశాలు అయితే ఉంటాయి. చర్మ సంరక్షణలో పొరపాట్ల వల్ల ముఖంపై మచ్చలు ఏర్పడే అవకాశంతో పాటు మొటిమలు వచ్చే ఛాన్స్ ఉంటుంది.
హార్మోన్ల అసమతుల్యత వల్ల, జిడ్డు చర్మం వల్ల కూడా కొన్నిసార్లు ముఖంపై మొటిమలు వస్తాయి. ముఖంపై టోనర్ ను క్రమం తప్పకుండా రాయడం ద్వారా ఈ సమస్యను దూరం చేసుకోవచ్చు. గర్భం ధరించిన మహిళలలో చాలామంది ముఖంపై మొటిమలు ఏర్పడే ఛాన్స్ ఉంటుంది. ఎక్కువ సంఖ్యలో మొటిమలు, మచ్చలు ఉంటే ఆ సమస్యలు మెలస్మా అని అంటారు.
యుక్తవయస్సు ప్రారంభం నుంచి మధ్యవయసు వచ్చేవరకు ఆడపిల్లలను ఎక్కువగా ఈ సమస్య వేధించే అవకాశాలు అయితే ఉంటాయి. మహిళల సౌందర్యాన్ని సవాల్ చేసే సమస్యలలో ఈ సమస్య కూడా ఒకటి కావడం గమనార్హం. చర్మంలో నూనె గ్రంథుల పనితీరులో తేడా ఉన్నప్పుడు మొటిమల సమస్య వేధిస్తుంది. బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్ వల్ల కూడా మొటిమల సమస్య వచ్చే అవకాశాలు ఉంటాయి.
గోరువెచ్చని నీటితో ముఖం శుభ్రంగా కడుక్కుని మెంతి ఆకులతో చేసిన పేస్ట్‌ని ముఖానికి పట్టించి ఆరిన తర్వాత కడిగేస్తే మొటిమలు తగ్గే ఛాన్స్ ఉంటుంది . కమలా పళ్ళ తొక్కలను ఎండ బెట్టి చూర్ణం చేసి ముఖానికి రాసుకుంటే ముఖంపై మచ్చలు తగ్గుతాయి. కొత్తిమీర రసంలో చిటికెడు ఉప్పు కలిపి ముఖానికి రాసి శుభ్రం చేసుకోవడం ద్వారా కూడా ఈ సమస్యను దూరం చేసుకోవచ్చు.