అతిగా నిద్రపోయే అలవాటు ఉందా… మీరు ఈ ప్రమాదంలో పడినట్లే… జర జాగ్రత్త!

sleeping

సంపూర్ణ ఆరోగ్యవంతమైన జీవితాన్ని పొందాలంటే మన శరీరానికి ప్రతి ఒక్కటి కూడా అవసరమైన మోతాదులు తీసుకున్నప్పుడే సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చు అది ఆహారం అయినా నిద్ర అయినా.చాలామంది రోజులు ఎక్కువ సమయం నిద్రపోవడానికి ఇష్టపడతారు అయితే ప్రతిరోజు ఎనిమిది గంటల నిద్ర మాత్రమే అవసరమని వైద్యులు సూచిస్తున్నారు.సరైన నిద్ర మానసిక ప్రశాంతతని, ఒత్తిడిని తగ్గించి జీవితకాలం పాటు ఆరోగ్యంగా ఉండునట్లు చేస్తుంది.నిద్రలేమితో బాధపడుతున్న లేదా అతిగా నిద్రపోయినా ఈ రెండు అనారోగ్యానికి సూచికలుగా భావించవచ్చు..

ప్రతిరోజు అతిగా నిద్రించే వారిలో శరీరం బద్దకంగా తయారవుతుంది.దాంతో మెదడు పనితీరుపై ప్రభావం చూపి స్వతహాగా ఆలోచించే శక్తి లోపిస్తుంది,మెద‌డు మొద్దుబారిపోతుంది.తద్వారా సొంతంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేక ఎంతో మానసికక్షోభతో బాధపడాల్సి వస్తుంది.ప్రతిరోజు 8 గంటల కంటే ఎక్కువ సమయం నిద్రపోవడం వల్ల మన శరీరంలోని కొవ్వు పదార్థాలు పేరుకుపోయి ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులు వంటి వ్యాధులు చుట్టుముడుతాయని నిపుణులు పేర్కొంటున్నారు.

అతిగా నిద్ర పోవడం అనేది మన గుండె పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దానివల్ల భవిష్యత్తులో గుండె సంబంధిత వ్యాధులతో బాధపడాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఎక్కువ సమయం నిద్రించే అలవాటు ఉంటే వెంటనే అలవాటు మార్చుకోవడం మంచిది.అతినిద్ర వ్యాధితో బాధపడేవారు డిప్రెషన్‌లోకి కూడా వెళ్లవచ్చు. ఎందుకంటే ఎక్కువ నిద్రపోవడం వల్ల మనిషి శారీరక శ్రమ తగ్గుతుంది దాంతో మెదడుపై తీవ్ర ప్రభావం పడి మానసిక స్థితి కూడా ప్రభావితమవుతుంది.అందుకే కేవలం ఎనిమిది గంటలు మాత్రమే నిద్రపోతూ సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడం ఎంతో అవసరమని నిపుణులు చెబుతున్నారు.