ప్రతిరోజు జొన్న రొట్టెలను తింటే ఈ వ్యాధులతో భయపడాల్సిన అవసరమే రాదు తెలుసా?

మన పూర్వీకులు జొన్నలు, రాగులు, కొర్రలు వంటి చిరుధాన్యాలను ఆహారంగా తీసుకొని జీవితకాలం పాటు ఎంతో ఆరోగ్యంగా జీవించారు కానీ మనం చిరుధాన్యాలను తినడం మానేసి అత్యధిక కార్బోహైడ్రేట్స్,అత్యల్ప ఫైబర్ కలిగిన బియ్యాన్ని ఎక్కువగా తినడం వల్ల ఊబకాయం, డయాబెటిస్, బిపి, గుండెపోటు వంటి అనేక జబ్బులతో ప్రతి దినం సతమతమవుతూనే ఉన్నాం. ఇప్పటికైనా మేల్కొని రోజులో ఒక్క పూటైనా చిరుధాన్యాలను ఆహారంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.ముఖ్యంగా జొన్న చిరుధాన్యాన్ని ఆహారంగా తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఈరోజు తెలుసుకుందాం.

జొన్న చిరుధాన్యంలో కాల్షియం, ఐరన్ ,పాస్ఫ‌ర‌స్‌, ఫైబ‌ర్, మెగ్నీషియం, విటమిన్ డి, విటమిన్ b3 వంటి పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి.జొన్న చిరుధాన్యంతో జొన్న రొట్టెలనే కాకుండా జొన్న పాయసం, జొన్న సంగటి వంటి వంటకాలు ఎంతో ప్రాముఖ్యత పొందాయి. జొన్న చిరుధాన్యంలో కార్బోహైడ్రేట్స్, కొవ్వులు చాలా తక్కువగా ఉండి ప్రోటీన్స్, ఫైబర్ అధిక మొత్తంలో లభ్యమవుతుంది కావున శరీర దృఢత్వానికి సహాయపడడమే కాకుండా ఒంట్లో చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి ఉబకాయం, రక్తపోటు గుండెపోటు ప్రమాదాలను కూడా నివారిస్తుంది.

ప్రతిరోజు జొన్న రొట్టెలను ఆహారంగా తీసుకుంటే జొన్నల్లో అత్యధికంగా ఉన్న పీచు పదార్థం రక్తంలో గ్లూకోస్ స్థాయిలను నియంత్రించి షుగర్ వ్యాధిని అదుపులో ఉంచుతుంది. తరచూ జొన్న రొట్టెలను ఆహారంగా తినేవారిలో జీవిత కాలం పాటు కీళ్ల నొప్పులు, కీళ్ల వాపులు వంటి సమస్యలు తలెత్తే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. మరియు మన శరీరానికి అవసరమైన ఐరన్, ఫోలిక్ ఆమ్లం సమృద్ధిగా లభించి హిమోగ్లోబిన్ ఉత్పత్తిలో సహాయపడుతుంది తద్వారా రక్తహీనత సమస్య తొలగిపోతుంది. జొన్న ధాన్యంలో అధికంగా లభ్యమయ్యే పీచు పదార్థం జీర్ణశక్తిని పెంచి మలబద్ధకం, గ్యాస్ట్రిక్ , ఫైల్స్, ఎసిడిటీ సమస్యలను తగ్గిస్తుంది.