ఎసిడిటీ సమస్య తలెత్తినప్పుడు వీటిని తింటే తక్షణ ఉపశమనం పొందవచ్చు తెలుసా?

ఈరోజుల్లో చాలా మంది ఎసిడిటీ, అజీర్తి, గ్యాస్టిక్ వంటి జీర్ణ సంబంధిత సమస్యలతో నిత్యం సతమతమవుతున్నారు. దీనికి గల కారణాలను పరిశీలిస్తే క్రమ పద్ధతి లేని ఆహారపు అలవాట్లు, కాఫీ టీ , సాఫ్ట్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకోవడం, ఆల్కహాల్ ధూమపానం సేవించడం, సమయానికి భోజనం చేయలేకపోవడం వంటి కారణాలను ప్రధానంగా చెప్పుకోవచ్చు. కారణాలు ఏవైనా ఎసిడిటీ సమస్య తెలిపితే కడుపులో మంట, వికారం వంటి లక్షణాలతో ఏ పని పైన ఏకాగ్రత చూపులేము. పేగుల్లో యాసిడ్ రిఫ్లెక్షన్ అరికట్టి ఎసిడిటీ సమస్య నుంచి తక్షణ ఉపశమనం పొందాలంటే కొన్ని రకాల పండ్లును ఆహారంగా తీసుకుంటే సరిపోతుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.

ప్రతిరోజు భోజనం చేసిన వెంటనే ఒక అరటిపండును ఆహారంగా తీసుకుంటే సంపూర్ణ పోషకాహారం లభించడంతోపాటు జీర్ణ సంబంధిత సమస్యలన్నీ తొలగిపోతాయి. అరటి పండులో సమృద్ధిగా ఫైబర్, ఆల్కలీన్ లక్షణాలు కలిగి ఉన్నందువల్ల పొట్టలో యాసిడ్ రిప్లక్షణను అరికట్టి జీర్ణాశయంలో ఆమ్లాలను సముతల్యం చేయడంలో సహాయపడుతుంది. తద్వారా ఎసిడిటీ సమస్య తొలగిపోయి కడుపు మంట,తేపులు వంటి లక్షణాల నుంచి విముక్తి పొందవచ్చు. అరటి పండు పై కాసింత నల్ల ఉప్పు చల్లుకొని తింటే మరింత సమర్థవంతంగా పనిచేస్తుంది.అత్యల్ప యాసిడ్ గుణాలు ఉన్న కొబ్బరి నీళ్లను ప్రతిరోజు సేవిస్తే కడుపులో ఆమ్ల లక్షణాలను తగ్గించి పేగు కదలికలను మెరుగుపరుస్తుంది తద్వారా జీర్ణశక్తి మెరుగుపడి ఎసిడిటీ, అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యలు తొలగిపోతుంది.

ఆపిల్ పండు లో కూడా జీర్ణవ్యవస్థను మెరుగుపరిచే ఔషధ గుణాలు నిండుగా ఉన్నాయి. ముఖ్యంగా మెగ్నీషియం, పొటాషియం , కాల్షియం వంటి ఆల్కలీన్ ఖనిజలవనాలు పొట్టలో యాసిడ్ రిఫ్లెక్షన్ అరికట్టి ఎసిడిటీ సమస్య నుంచి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి.కావున ప్రతిరోజు ఉదయాన్నే ఒక యాపిల్ పండును ఆహారంగా తీసుకుంటే సరిపోతుంది. బెర్రీ పండ్లు శరీరంలోని యాసిడ్ రిఫ్లెక్స్‌ను తగ్గిస్తుంది మరియు కడుపు సమస్యల నుండి ఉపశమనం కూడా అందిస్తుంది. దీనితో పాటు, కడుపు ఉబ్బరం సమస్యను కూడా దూరం చేస్తుంది.