మనలో చాలామంది ఏదో ఒక సందర్భంలో మొండి వ్యాధుల వల్ల ఇబ్బందులు పడి ఉంటారు. కొన్నిసార్లు ఎంతమంది వైద్యులను సంప్రదించినా ఈ మొండి వ్యాధులకు చెక్ పెట్టడం సాధ్యం కాదు. అయితే ఒక ఆలయాన్ని దర్శించుకోవడం ద్వారా ఎలాంటి మొండి రోగాలు అయినా దూరమవుతాయని భక్తులు విశ్వసిస్తారు. సిద్ధిపేట జిల్లాలోని భూక్కల్ మండలంలో ఉన్న శివుడిని పూజించడం ద్వారా వైద్య సమస్యలు తొలగిపోతాయని చాలామంది విశ్వసిస్తారు.
ఈ ఆలయాన్ని సందర్శించిన తర్వాత అనుకూల ఫలితాలు కలగడంతో పాటు మంచి జరిగిందని ఎంతోమంది భక్తులు చెబుతున్నారు. గ్రహ పీడితులు సైతం ఈ ఆలయాన్ని సందర్శించడం ద్వారా శుభ ఫలితాలు కలిగాయని వెల్లడిస్తున్నారు. స్వామి కలలో కనిపించి ఆశీర్వదించడంతో పాటు రోగాలను మాయం చేస్తాడని భక్తులు బలంగా నమ్ముతారు. ఎన్ని ఆస్పత్రులు తిరిగినా పరిష్కారం దొరకని వారు ఈ ఆలయాన్ని ఒక్కసారి సందర్శిస్తే మంచి జరుగుతుందని నమ్ముతారు.
బ్రతుకు మీద మమకారం ఉన్నవాళ్లు ఒక్కసారి ఈ ఆలయాన్ని సందర్శిస్తే కోరిన కోరికలు నెరవేరతాయి. ఇతర రాష్ట్రాల నుంచి సైతం ఈ ఆలయానికి భక్తులు వస్తారు. ఈ ఆలయం చుట్టూ కొన్ని ఉపాలయాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న గుట్టపై కొన్ని సంవత్సరాల క్రితం ఆంజనేయ స్వామి ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఇక్కడ అర్చకత్వం నిర్వహించడం పూర్వజన్మ సుకృతం అని పూజారులు చెబుతున్నారు.
ప్రతి ఒక్కరూ తమ జీవిత కాలంలో ఒక్కసారైనా ఈ ఆలయాన్ని దర్శించుకుంటే శుభ ఫలితాలు కలుగుతాయి. బస్సు, ఆటోల ద్వారా ఈ ఆలయాన్ని చేరుకునే అవకాశం అయితే ఉంటుంది. పూజా కైంకర్యాల కోసం భూమిని, మామిడి తోటను దానం చేశారని ఇక్కడి ఆలయ శాసనాల ద్వారా వెల్లడవుతోంది.