మద్యపానం ఆరోగ్యానికి మంచిది కాదు. అయితే ఇటీవలే కొన్ని పరిశోధన ఫలితాలు తెలిసింది ఏమంటే ప్రతిరోజు ఒక గ్లాస్ రెడ్ వైన్ ను సేవిస్తే ఎన్నో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలను అదుపులో ఉంచవలసినని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే రెడ్ వైన్ ను మోతాదుకు మించి తాగితే గుండె జబ్బులు, ఊబకాయం, డయాబెటిస్, అధిక రక్తపోటు వంటి ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని తీవ్రంగా హెచ్చరిస్తున్నారు.ప్రతిరోజు రెడ్ వైన్ ను పరిమితంగా తీసుకునే వారిలో కలిగే ఆరోగ్య ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యంగా రెడ్ వైన్ లోనీ యాంటీ మైక్రోబియల్ గుణాలు,ఫినాల్స్, ఇన్ఫ్లమేషన్లు మన శరీరంలోని క్యాన్సర్ కణాలతో సమృద్ధిగా పోరాడి అనేక క్యాన్సర్ నుండి రక్షణ కల్పిస్తాయి ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్,
ప్రోస్టేట్ క్యాన్సర్, నోటి క్యాన్సర్లను అదుపు చేయడంలో రెడ్ వైన్ లోని ఔషధ గుణాలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. పరిమితంగా రెడ్ వైన్ ను సేవిస్తే వీటిలో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్ జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరిచి శరీరంలోని చెడు మలినాలను బయటకు పంపడంలో అద్భుతంగా సహాయపడుతుంది. ఆస్తియో ఫోరోసిస్ వంటి ఎముకల సంబంధిత వ్యాధులను అదుపు చేసే గుణాలు రెడ్ వైన్ లో ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
రోజుకు ఒక్క గ్లాస్ రెడ్ వైన్ ను సేవిస్తే గుండె ఆరోగ్యాన్ని కూడా పెంపొందించుకోవచ్చునని వైద్యులు చెబుతున్నారు.రెడ్ వైన్లో యాంటీఆక్సిడెంట్లు, రెస్వెరాట్రాల్, ఎల్‌డిఎల్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె కణాలను బలోపేతం చేయడమే కాకుండా గుండె కరోనరీ ధమనులను కూడా ఇది శాంత పరుస్తుంది. అలాగే రక్తం గడ్డ కట్టడాన్ని నివారించి రక్త నాళాలను దృఢపరచి రక్త ప్రసరణ వ్యవస్థను కూడా మెరుగుపరుస్తుంది. రెడ్ వైన్ ను తరచూ సేవించడం వల్ల హెలికోబాక్టర్ పైలోరీ నుంచి ఇన్ఫెక్షన్ తగ్గుతుందని అనేక పరిశోధనల్లో తేలింది.రెడ్ వైన్ లో ఉండే రెస్వెరాట్రాల్ అమిలాయిడ్ ప్రోటీన్ ఏర్పడటాన్ని నిరోధించి మెదడు ఆరోగ్యాన్ని పెంచడంతోపాటు మతిమరుపు సమస్యను తగ్గించి జ్ఞాపక శక్తిని పెంచడంలో కూడా సహాయపడుతుంది.