పొడి దగ్గు సమస్యతో నలుగురిలో మాట్లాడలేకపోతున్నారా? అయితే ఇలా చేయండి?

తరచూ తీవ్రమైన పొడి దగ్గు సమస్య మిమ్మల్ని ఒకచోట కుదురుగా ఉండనివ్వదు. రోజువారి కార్యక్రమాల్లో తీవ్ర ఆటంకం కలిగిస్తూ చిరాకు తెప్పిస్తుంది. దగ్గు సమస్యకు అనేక కారణాలు ఉండొచ్చు కారణాలు ఏవైనా దగ్గు సమస్య దీర్ఘకాలం పాటు మిమ్మల్ని వేధిస్తుంటే మాత్రం తప్పనిసరిగా వైద్య సలహాలు తీసుకొని తగిన చికిత్స తీసుకోవడం ఉత్తమం. నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో ప్రాణాంతకమైన ప్రమాదకర వ్యాధులకు కారణం కావచ్చు.

తరచూ మీలో దగ్గు సమస్య కలయికడానికి గల కారణాలను పరిశీలిస్తే వాతావరణ కాలుష్యం కారణంగా శ్వాస వ్యవస్థలో అలర్జీ ,ఇన్ఫెక్షన్ ప్రారంభమై తీవ్ర దగ్గు సమస్యకు కారణం కావచ్చు. దీర్ఘకాలిక వ్యాధులైన ఆస్తమా, బ్రాంకైటిస్ న్యుమోనియా, టిబి వంటి వ్యాధులు ఉన్న వారిలో కూడా తరచూ దగ్గు సమస్య తలెత్తవచ్చు.అలాగే మానసికపరమైన సమస్యలు, హై బీపీ సమస్యతో ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా కొంతమందిలో దగ్గు ఎక్కువగా వస్తుంది. మరికొందరిలో ఎసిడిటీ అజీర్తి వంటి జీర్ణ సంబంధ వ్యాధులతో బాధపడుతున్నప్పుడు కూడా దగ్గు సమస్య తలెత్తవచ్చు. అందుకే దగ్గు సమస్య తీవ్రమైనప్పుడు తప్పనిసరిగా వైద్య సలహాలు తీసుకోవాలి.

సాధారణ దగ్గు సమస్య నుంచి తక్షణ ఉపశమనం పొందడానికి కొన్ని వంటింటి చిట్కాలను పాటించవచ్చు. ప్రతిరోజు అల్లం టీ ని సేవిస్తే గొంతులో ఉండే ఇన్ఫెక్షన్, అలర్జీలు తగ్గి తక్షణ ఉపశమనం లభిస్తుంది. గొంతు ఇన్ఫెక్షన్ కారణంగా దగ్గు సమస్య తలెత్తినప్పుడు గోరువెచ్చని నీళ్లల్లో రాళ్ల ఉప్పును కలిపి రోజుకు మూడుసార్లు నోట్లో ఉప్పు నీళ్లు వేసుకొని ఉక్కిలిస్తే గొంతులో ఇన్ఫెక్షన్ తగ్గి సమస్య నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది. రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీళ్లల్లో చిటికెడు పసుపు వేసుకొని సేవిస్తే దగ్గు సమస్య తగ్గుతుంది. మరియు గోరువెచ్చని నీళ్లలో తేనె కలుపుకొని సేవించినా కూడా మంచి ఫలితం ఉంటుంది. అలాగే అలర్జీ సమస్య ఉన్నవారు బయటకు వెళ్ళినప్పుడు దుమ్ము ధూళి పుప్పడి రేణువుల నుంచి రక్షణ పొందడానికి తప్పనిసరిగా మాస్కు ధరించాలి.