ఎన్ని ప్రయత్నాలు చేసినా శరీర బరువు నియంత్రణలోకి రాలేదా? అయితే ఈ డైట్ ఫాలో అవ్వండి!

high_blood_pressue_diet

యుక్త వయస్సులోనే శరీర బరువు వేగంగా పెరిగి తీవ్ర మానసిక ఒత్తిడిని అనుభవిస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడం ఒకింత ఆందోళన కలిగించే అంశం అనే చెప్పొచ్చు. శరీర బరువు పెరగడానికి కారణాలు ఏవైనా కావచ్చు. ఫలితం మాత్రం భవిష్యత్తులో ఊబకాయం, గుండె జబ్బులు డయాబెటిస్, రక్తపోటు, కీళ్ల నొప్పులు, మానసిక ఒత్తిడి వంటి తీవ్ర అనారోగ్య సమస్యలకు కారణమవుతోంది.శరీర బరువును నియంత్రించు కోవడానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తూ చివరకు అలసిపోయి నిరుత్సాహపడుతున్నారా. ఈ సమస్య నుంచి బయటపడడానికి ఇప్పుడు చెప్పబోయే డైట్ రోజువారి ఆహారంలో పాటిస్తే సహజ సిద్ధంగా శరీర బరువులు నియంత్రించుకోవచ్చు.

ఆ డైట్ ఎలా ఫాలో అవ్వాలి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వంటి విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక కప్పు మొలకెత్తిన పెసర గింజలను తీసుకోవాలి. అందులోకి అర కప్పు క్యారెట్ ముక్కలు, అర కప్పు తొక్క తొలగించిన కీర ముక్కలు, అర కప్పు టమాటో ముక్కలు, ఒక కప్పు దానిమ్మ గింజలు వేసుకోనీ రుచికోసం బ్లాక్ సాల్ట్, పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి, చిటికెడు ఇంగువ, రెండు టేబుల్ స్పూన్లు లెమన్ జ్యూస్, వన్ టేబుల్ స్పూన్ చియా సీడ్స్, రెండు టేబుల్ స్పూన్లు తరిగిన కొత్తిమీర వేసి బాగా కలిపితే మన రుచికరమైన సలాడ్ సిద్ధమవుతుంది. దీన్ని ప్రతిరోజు మీ డైట్ లో తీసుకుంటే మనలో ఆకలి అనే ఫీలింగ్ తగ్గించి శరీర బరువును నియంత్రిస్తుంది. మరియు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా పొందవచ్చు.

రోజువారి ఆహారంలో ఈ డైట్ ను చేర్చుకుంటే మీలో పోషకాహారం లోపం తొలగిపోయి మీ శరీరం దృఢంగా, శక్తివంతంగా తయారవుతుంది. ఇందులో లభించే యాంటీ ఆక్సిడెంట్, విటమిన్ సి వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించి సీజనల్గా వచ్చే అనేక ఇన్ఫెక్షన్ల నుండి మనల్ని కాపాడతాయి. గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. మెదడు పనితీరు మెరుగుపడి జ్ఞాపకశక్తి పెంపొందుతుంది. వృద్ధాప్య ఛాయాలను తొలగించి చర్మాన్ని, జుట్టును కాంతివంతంగా ఉంచడంలో సహాయపడుతుంది.