షుగర్ వ్యాధి కంట్రోల్లో లేనివారు పొట్లకాయను తినొచ్చ? తింటే ఎలాంటి మార్పులు జరుగుతాయి?

తీగ జాతికి చెందిన పొట్లకాయను తినే విషయంలో చాలామందికి చాలా అపోహలే ఉన్నాయి. కారణం పొట్లకాయలో అలర్జీని కలిగించే గుణాలు ఎక్కువగా ఉన్నాయని వీటిని ఆహారంగా తీసుకుంటే మన శరీరంలో అనేక అలర్జీలకు కారణమవుతుందని వీటిని తినకుండా పక్కన పెట్టేస్తుంటారు. ఇంకొందరు అయితే పొట్లకాయ కొంత ఘాటువాసన ఉంటుందన్న కారణంతో దీన్ని తినడానికి ఇష్టపడరు. శీతాకాలంలో మాత్రమే లభించే పొట్లకాయలో ఉన్న పోషక విలువలు ఔషధ గుణాల గురించి తెలిస్తే ఎవరైనా పొట్లకాయను తినకుండా ఉండలేరు.

 

చలికాలంలో ఎక్కువగా లభించి పొట్లకాయను తరచూ మన ఆహారంలో తీసుకోవడం వల్ల కలిగి ఆరోగ్య ప్రయోజనాల గురించి వైద్యులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. పొట్లకాయలు మన శరీరానికి అవసరమైన విటమిన్ సి, విటమిన్ ఏ, బీ కాంప్లెక్స్, కాల్షియం ఐరన్ పొటాషియం, డేటరీ ఫైబర్, మెగ్నీషియం, జింకు వంటి మినరల్స్ సమృద్ధిగా లభిస్తాయి. సహజంగా శీతాకాలంలో మనలో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కావున చలికాలంలో సమృద్ధిగా లభించే పొట్లకాయను ఆహారంగా తీసుకుంటే వీటిలో పుష్కలంగా ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్ సి యాంటీ మైక్రోవేవ్ గుణాలు సీజనల్గా వచ్చే అనేక ఇన్ఫెక్షన్లను తొలగించి మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. పొట్లకాయలో సమృద్ధిగా ఉన్న పొటాషియం మెగ్నీషియం రక్తప్రసరణ వ్యవస్థలను నాడీ కణ వ్యవస్థలను మెరుగుపరిచి గుండె, మెదడు, లివర్, కిడ్నీ వంటి అవయవాల పనితీరును మెరుగు పరుస్తాయి.

 

ముఖ్యంగా డయాబెటిస్ వ్యాధి నియంత్రణలో లేనివారు ప్రతిరోజు పొట్లకాయను ఆహారంగా తీసుకోవడంతో పాటు పొట్లకాయ జ్యూస్ ను కూడా తాగడం అలవాటు చేసుకుంటే షుగర్ వ్యాధిని నియంత్రణలో ఉంచవచ్చునని వైద్యులు చెబుతున్నారు. కారణం పొట్లకాయలో డెంటరి ఫైబర్, విటమిన్ సి, సహజ యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి ఇవి రక్తంలో గ్లూకోస్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడి డయాబెటిస్ వ్యాధిని అదుపులో ఉంచుతాయి. అలాగే ఫైబర్ ఎక్కువగా ఉన్నందున మనం తీసుకున్న ఆహారం సులభంగా జీర్ణం అయ్యి సంపూర్ణ పోషకాలు లభిస్తాయి అలాగే శరీరంలోని చెడు మలినాలను తొలగించి మలబద్ధకం గ్యాస్ట్రిక్ వంటి సమస్యలను కూడా అదుపులో ఉంచుతాయి.