పాలలో చక్కెరకు బదులు బెల్లం కలిపి తాగవచ్చా… ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవా?

సాధారణంగా ఉదయం సాయంత్రం ఒక గ్లాసుడు పాలు తాగడం మనందరికీ అలవాటే. ప్రతిరోజు పాలు తాగడం వల్ల మన శరీరానికి అవసరమైన అన్ని సూక్ష్మ స్థూల పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. ముఖ్యంగా పాలల్లో కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, విటమిన్ ఏ , విటమిన్ డి, ప్రోటీన్స్ సమృద్ధిగా లభించి మనల్ని శారీరకంగాను మానసికంగానూ దృఢంగా ఉంచడంలో సహాయపడతాయి. ఇకపోతే పాలు తాగే అలవాటు ఉన్నవారు తప్పనిసరిగా పాలలో చక్కెర కలుపుకొని తాగుతూ ఉంటారు.

ఈ విధంగా పాలలో చక్కెరకు బదులు కొందరు బెల్లం కలుపుకొని కూడా తాగుతూ ఉంటారు ఇలా కలుపుకొని తాగడం వల్ల మరింత ఆరోగ్య ప్రయోజనాలు మన సొంతమవుతాయని భావిస్తారు అయితే నిజంగానే పాలల్లో బెల్లం కలుపుకొని తాగడం వల్ల ఏ విధమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవా…నిజంగానే ఇది ఆరోగ్యానికి మంచిదేనా ఇలా బెల్లం కలుపుకొని తాగడం వల్ల ఏ విధమైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయాన్ని వస్తే….

పని ఒత్తిడి కారణంగా అలసట, నీరసం వంటి సమస్యలతో బాధపడేవారు రాత్రి పడుకునే ముందు బెల్లం కలిపిన పాలను ప్రతిరోజు సేవిస్తే వీటిలో పుష్కలంగా ఉన్న సహజ యాంటీ ఆక్సిడెంట్ మానసిక ఒత్తిడిని తొలగించి నిద్రలేమి సమస్యను దూరం చేస్తుంది. అలాగే బెల్లం లో సమృద్ధిగా ఉండే ఫైబర్ మనం తీసుకున్న ఆహారాన్ని త్వరగా జీర్ణం అవ్వడానికి సహకరించి సుఖప్రదమైన నిద్రను కలిగిస్తుంది. మన శరీరానికి కావలసిన కాల్షియం, ఐరన్ ,సెలీనియం, జింకు వంటి సహజ పోషకాలు సమృద్ధిగా లభించి మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంతోపాటు ఎముకలు ,కీళ్లు దృఢంగా ఉండునట్లు చేస్తుంది. రక్తహీనత సమస్యతో బాధపడే వారికి పాలలో బెల్లం కలుపుకుని తాగడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.