దేశంలో రోజురోజుకు పొగ తాగేవాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కొంతమంది చిన్న వయస్సులోనే సిగరెట్ ను అలవాటు చేసుకుంటుండగా మరి కొందరు స్నేహితులను చూసి సిగరెట్ అలవాటు చేసుకుంటున్నారు. అయితే సిగరెట్ తాగడం వల్ల ఆరోగ్యానికి నష్టం కలిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ప్రతిరోజూ సిగరెట్ తాగితే మెదడు సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి.
ఎవరైతే ఎక్కువ సంఖ్యలో సిగరెట్లు తాగుతారో వాళ్లలో మెదడు పరిమాణం తగ్గే అవకాశం ఉంటుంది. అయితే ఒకసారి సిగరెట్ కు అలవాటు పడితే త్వరగా ఆ అలవాటును మానుకోలేమని చెప్పవచ్చు. మెదడుపై సిగరెట్ ప్రభావం పడితే ఇతర ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశాలు అయితే ఉంటాయి. సిగరెట్లు తాగేవాళ్లకు గుండె జబ్బులతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది.
ఎవరైతే సిగరెట్లను ఎక్కువగా తాగుతారో వాళ్ల ఊపిరితిత్తులు బలహీనపడుతాయని డాక్టర్ల పరిశోధనలో వెల్లడైంది. సిగరెట్లు ఎక్కువగా తాగేవాళ్లలో శృంగార సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. సిగరెట్లు ఎక్కువగా తాగే అలవాటు ఉంటే ఒకసారి స్కానింగ్ చేయించుకుంటే మంచిదని చెప్పవచ్చు. సిగరెట్లు ఎక్కువగా తాగేవాళ్లలో జ్ఞాపకశక్తి తగ్గే అవకాశం ఉంటుంది.
సిగరెట్లు ఎక్కువగా తాగే అలవాటు ఉన్నవాళ్లు ఇతరులతో కమ్యూనికేట్ చేసే విషయంలో కూడా ఎన్నో ఇబ్బందులు పడతారని తెలుస్తోంది. స్మోకింగ్ కు గుడ్ బై చెప్పాలని భావించే వాళ్లు ఆరోగ్య నిపుణులను సంప్రదిస్తే మంచిది. స్మోకింగ్ కు ఎంత దూరంగా ఉంటే ఆరోగ్యానికి అంత మంచిదని చెప్పవచ్చు.