Coconut Oil: వంటకాల్లో కొబ్బరినూనె ఉపయోగిస్తే లాభాలు ఇవే..!

Coconut Oil: కొబ్బరి.. పేరు వినగానే కొబ్బరి నూనె, కొబ్బరి పచ్చడి, కొబ్బరి నీళ్లు.. ఇవే గుర్తొస్తాయి. మన ఆరోగ్యం విషయంలో కొబ్బరి చలా ముఖ్యం. మన రోజువారీ జీవనంలో కూడా కొబ్బరి ప్రముఖ పాత్రే పోషిస్తుంది. కానీ.. కొబ్బరి వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. కొబ్బరిలో పోషకాలు, విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి మీ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. కొబ్బరి నూనె మన రోగనిరోధక వ్యవస్థ మెరుగుపరుస్తుంది. ఆరోగ్యకరమైన జీవక్రియను కల్పిస్తుంది. మలయాళీలు తమ ఆహార ఉత్పత్తుల్లో ఎక్కుగా ఉపయోగించేది కొబ్బరినూనెనే.

కొబ్బరిని బిస్కెట్లు, స్వీట్లు, డెజర్ట్‌ లు తయారు చేయడానికి బాగా ఉపయోగిస్తారు. పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరి.. వేటికవే ప్రత్యేకంచి లాభాలు చేకూరుస్తాయి. కొబ్బరి నూనె వంటాకాల్లో ఉపయోగించడం వల్ల కడుపులో కొవ్వు కరిగి బరువు తగ్గేలా చేస్తుంది. కానీ.. కొబ్బరినూనెను వంటకాల్లో వాడేవారు తక్కువ. జీవక్రియ వేగం పెంచి కేలరీలను బర్న్ చేయడానికి సాయపడుతుంది. కొబ్బరిలో సహజంగా ఉండే చక్కెర రక్తంలోని చక్కెర స్థాయిని నియత్రిస్తుంది. కొబ్బరినూనె డయాబెటిక్ సమస్యలను తొలగిస్తుంది.

కొబ్బరినూనెలో మరో మంచి గుణం ఏంటంటే ఇందులోని లారిక్ ఆమ్లం శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. కొబ్బరి నీళ్ళలో చక్కెర, కొవ్వు శాతం తక్కువగా ఉండటం కూడా ఒక కారణం. ఇందులోని మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం.. ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా ఇందులోని యాంటీ కార్సినోజెనిక్ క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడుతుంది. కొబ్బరినూనెలోని కొవ్వు ఆమ్లాలు శరీరంలో క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా నిరోధిస్తాయి.

కొబ్బరినూనెలోని యాంటీవైరల్, యాంటీ మైక్రోబియల్ కణాలు శరీరంలోని ఇతర ఇన్ఫెక్షన్లపై పోరాడతాయి. దీనిలోని లారిక్ ఆమ్లం శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచుతుంది. నోటిలో వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. దీనిలోని యాంటీమైక్రోబయల్, యాంటీ ఫంగల్ లక్షణాలు బాడీలోని ఇన్ఫెక్షన్‌ను పోగడతాయి. కొబ్బరినూనెలోని కాల్షియం వల్ల దంతాలు మరింత బలంగా మారతాయి. చెడు శ్వాస, దంత క్షయాన్ని పోగడుతుంది. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ల బారిన పడే మహిళలకు చక్కని పరిష్కారం చూపుతుంది. కిడ్నీ వ్యాధులు, కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా నిరోధిస్తుంది.

 

గమనిక: ఈ వివరాలు మీ అవగాహన కోసం మాత్రమే. పలు సందర్భాల్లో ఆహార నిపుణులు, వైద్యులు అందించిన వివరాలనే ఇక్కడ ఇచ్చాం. మీ ఆరోగ్యం విషయంలో ఎటువంటి సమస్య ఉన్నా, సలహాలకైనా వైద్యులను, ఆహార నిపుణులను సంప్రదించడమే ఉత్తమం. మీ ఆరోగ్యానికి సంబంధించి ‘తెలుగు రాజ్యం’ ఎటువంటి బాధ్యత వహించదు. గమనించగలరు.