Aloe vera: వేసవిలో కలబంద వల్ల ఉపయోగాలెన్నో చూడండి..!

Aloe vera: చర్మ సౌందర్యానికి మనం ఎంతో ప్రాధాన్యం ఇస్తాం. అందుకే అనేక కాస్మెటిక్స్ వాడతాం. బ్యూటీ పార్లర్లకు వెళ్తాం. హోం రెమెడీస్ కూడా వాడతాం. అయితే.. కాలాన్నిబట్టి చర్మంలో తేడాలు వస్తూంటాయి. ఈ సమయంలో తీసుకునే జాగ్రత్రలతో చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవచ్చు. ప్రస్తుతం ఎండాకాలం కాబట్టి చర్మం కందిపోవడం సహజం. ఈ సమయంలో కలబంద ఎంతో మేలు చేస్తుంది. దీంతో చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవచ్చు.

వేసవిలో చెమటలు, స్కిన్ బర్న్, దురదలు, కందిపోవడం వంటివి జరుగుతుంది. వేసవిలో శరీరంపై పడే సూర్య కిరణాల వల్ల చర్మంపై ఈ సమస్యలు వస్తూంటాయి. ఈ సమస్యలకు లోషన్లు, క్రీములు కంటే ప్రకృతి వైద్యం ‘అలోవెరా’ (కలబంద)తో సమస్యని తరిమికొట్టొచ్చు. చర్మ సమస్యల్ని తగ్గించుకోవడానికి ఇదొక సులువైన పద్ధతి. స్కిన్ ప్రొడక్ట్స్ లో దీనిని విరివిగి ఉపయోగిస్తారు కూడా. కెమికల్స్ కంటే ఇలా స్వచ్చమైన అలోవెరాతో సమస్యను తగ్గించుకోవడం ఉత్తమమని నిపుణులు అంటున్నారు.

బాడీ డీహైడ్రేట్ కాకుండా నీళ్లు ఎక్కువ తాగినట్టే చర్మాన్ని కూడా హైడ్రేట్ గా ఉంచాలి. వేసవిలో ఎండలకు చెమట ద్వారా చర్మం డీహైడ్రేట్ కు గురవుతుంది. దీనిపై అలోవెరాను మాయిశ్చరైజర్ గా అప్లై చేస్తే చర్మం డీహైడ్రేట్ కాకుండా ఉంటుంది. అలోవెరా క్రీమ్ ను రాసినా ఉపయోగం ఉంటుంది. చర్మాన్ని మృదువుగా చేస్తుంది. ఉపశమనాన్ని ఇస్తుంది. ఎండల సమయంలోనే కాకుండా స్కిన్ పొడిబారినా, దురద, మంట కలిగినపుడు కూడా కలబందను అప్లై చేయొచ్చు. అలోవెరా లో చల్లదన్నిచ్చే గుణం మంచి రిలీఫ్ ఇస్తుంది.

అందంగా ఉండడానికి అలోవెరా బాగా పని చేస్తుంది. చర్మాన్ని సూర్య కిరణాల వల్ల కలిగే హాని నుంచి spf తో కూడిన అలోవెరా ఉపయోగిస్తే మంచి చర్మమే కాదు.. అందంగా కూడా కనిపించేలా చేస్తుంది. అలొవెరా కేవలం చర్మానికి మాత్రమే కాదు జుట్టుకు కూడా చాలా మంచిది. ప్రస్తుత వర్క్ ఫ్రమ్ హోమ్ సమయంలో డై ఫేస్, హెయిర్ మాస్కులు కూడా అలోవెరా తో ఉపయోగించి ఫలితాలు పొందొచ్చు. స్కిన్ ఇరిటేషన్ కు అలోవేరా బాగా పని చేస్తుంది. అలొవెరాతో ఉన్న ఈ బెనిఫిట్స్ ను ప్రకృతి అందించిన వరం అనే చెప్పాలి.

 

గమనిక: ఈ వివరాలు మీ అవగాహన కోసం మాత్రమే. పలు సందర్భాల్లో నిపుణులు, వైద్యులు అందించిన వివరాలనే ఇక్కడ ఇచ్చాం. మీ ఆరోగ్యం విషయంలో ఎటువంటి సమస్య ఉన్నా, సలహాలకైనా వైద్యులను, నిపుణులను సంప్రదించడమే ఉత్తమం. మీ ఆరోగ్యానికి సంబంధించి ‘తెలుగు రాజ్యం’ ఎటువంటి బాధ్యత వహించదు. గమనించగలరు.